AP Health Department: మానసిక సమస్యల పరిష్కారానికి విజయవాడ సిద్ధార్ధ వైద్యకళాశాలలో టెలిమానస్ కేంద్రాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది. మానసిక సమస్యల కోసం 14416 లేదా 180089114416 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి టెలీ కౌన్సెలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ టెలీ మానస్ కేంద్రం ద్వారా సేవలు అందుతాయని వెల్లడించింది. మానసిక సమస్యలు ఉన్న వారికి టెలిఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ద్వారా సూచనలు, సలహాలు అందించనున్నట్టు తెలిపింది.
మానసిక సమస్యలు ఉన్న వారికి... ఏపీ వైద్యారోగ్యశాఖ తీపి కబురు - AP Highlights
AP Health Department: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి, సమస్యలతో బాధపడుతుంటారు.. అది ఉద్యోగంలోగాని, వ్యాపారంలోగాని, కుటుంబ సమస్యలతోగాని మరే ఇతర కారణాల చేతనైనా ఒత్తిడికి గురౌతుంటారు. అలాంటి వారి కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మానసిక సమస్యల కోసం టెలిమానస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో పది శాతం మంది ప్రజలు మానసిక ఒత్తిళ్ళు, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తేలిందని స్పష్టం చేసింది. ఆర్థిక, సామాజిక సమస్యలు, పరీక్షలు, ఉద్యోగాన్వేషణలో తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా... అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయని స్ఫష్టం చేసింది. అయితే ఈ తరహా ఒత్తిళ్లు 90 శాతం మానసిక రుగ్మతల్ని కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించి ఆత్మహత్యల్ని నివారించే అవకాశం ఉందని తెలిపింది. అందుకే మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు టెలిమానస్ను సంప్రదించాలని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: