ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Govt Did Not Allocate Funds to Barrages: ఏటా వందల టీఎంసీల నీరు సముద్రం పాలు.. అయినా, బ్యారేజీల నిర్మాణాలపై నిర్లక్ష్యం - Delay Constructing Barrages

AP Govt Did Not Allocate Funds to Barrages on Krishna River: కృష్ణానదిలో మిగులు జలాల వినియోగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యారేజీల నిర్మాణం.. కాగితాలను దాటడం లేదు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా నిధులు విడుదలలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. బ్యారేజ్​ల నిర్మాణంలో ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ap_government_delay_constructing_barrages_on_krishna_river
ap_government_delay_constructing_barrages_on_krishna_river

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2023, 6:34 PM IST

Updated : Sep 27, 2023, 9:02 PM IST

AP Govt Did Not Allocate Funds to Barrageson Krishna River:కృష్ణానదిపై ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుల నిర్మాణాలు కార్యరూపం దాల్చకపోవడంతో వేలాది టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. మూడేళ్లుగా వరద నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. మరోవైపు సాగు నీటి ఎద్దడితో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగునీరు లేక ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరుఅందక పంటలను బీడుపెడుతున్నారు. నీటి ఎద్దడి ఫలితంగా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Farmers Fire on YSRCP Government :ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్న కృష్ణా మిగులు జలాల మొత్తం మూడేళ్లుగా బాగా పెరిగిందని రైతు సంఘల నేతల చెబుతున్నారు. ఈ ఏడాదిలో సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరకు దిగువకు విడుదల చేసినట్లు రైతు సంఘ నాయకులు వివరిస్తున్నారు.

Vykuntapuram Barrage Construction Stop నీళ్లు ఒడిసిపట్టుకోకపోతే అన్యాయమైపోతామనే సీఎం గారు.. వైకుంఠపురం బ్యారేజిని ఎందుకు ఆపేశారు!

Government Not Releasing Funds for Construction of Barrages : గతేడాది దాదాపు 496.6 టీఎంసీ ల మిగులు జలాలను బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేశారు. 2021-22లో 501.4 టీఎంసీ లు, 2020-21లో 1,278.1 టీఎంసీ ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇది గత రెండు దశాబ్దాలలోనే అత్యధికం. 2019-20లో దిగువకు వదిలిన నీరు 797.1 టీఎంసీ లు కాగా 2019-20కి ముందు ఐదేళ్లలో ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన మిగులు జలాలు 100 టీఎంసీల కంటే తక్కువే. ఇంత పెద్ద మొత్తంలో నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుండటంతో నదిపై కొత్తగా బ్యారేజీలు నిర్మించాలన్న డిమాండ్ రైతులు, రైతు సంఘాల నుంచి ఊపందుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం నదిపై మూడు బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించింది.

ప్రకాశం బ్యారేజీకి 16 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం వద్ద 4.131 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ఒక ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించారు. బ్యారేజీకి 67 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు-తూర్పుపాలేనికి మధ్యలో 4.950 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో రెండో బ్యారేజీ.. బ్యారేజీకి ఎగువన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దాములూరు వద్ద 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మూడో బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు.


Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు

ఈ మూడు బ్యారేజీల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 320 గ్రామాలకు తాగు, సాగు నీటి సమస్యను తీర్చొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు నీటిపారుదల శాఖ మూడు బ్యారేజీల కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను సిద్ధం చేసింది. ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్స్ అండ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డీపీఆర్లు రూపొందించారు. నిర్ణీత ప్రాంతాల్లో కట్టడాలకు అనువుగా ఉంటుందనే దానిపై D.G.P.S సర్వే కూడా చేపట్టారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, భూ పరీక్షలు నిర్వహించారు.

టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలకు సంబంధించి పలుమార్లు సమావేశం నిర్వహించారు. 2022-23 S.S.R. ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనాల వ్యయం కూడా రూపొందించారు. మొదటి బ్యారేజీ నిర్మాణానికి 2,235.42 కోట్ల రూపాయలు, రెండో బ్యారేజీ నిర్మాణానికి 2526.39 కోట్లు, మూడో దానికి 2514.42 కోట్లు వ్యయం అవుతుందని అంచానాలు తయారు చేశారు. వీటిని ప్రభుత్వానికి కూడా ఇది వరకే పంపారు. కానీ ఇంత వరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పడం కాకుండా నదిపై మూడు వంతెనలను నిర్మించి రైతులకు మేలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.


Farmers agitation: సాగు నీటి కోసం అన్నదాత పోరాటం.. ఏళ్లుగా విస్తరణకు నోచుకోని గుంటూరు ఛానల్‌

AP Govt did not allocate funds to Barrages ఏటా వందల టీఎంసీల నీరు సముద్రం పాలు
Last Updated : Sep 27, 2023, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details