NTR Health university: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు చట్ట సవరణ చేస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్ట సవరణకు ఆమోదం లభించినట్లయింది. గెజిట్ నోటిఫికేషన్ జారీతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు ఇక వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారిపోయింది. అక్టోబరు 31వ తేదీ నుంచి పేరు మార్పు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ గురించి గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రభుత్వం.. ఎక్కడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అందులో ప్రస్తావించకుండానే మార్పు చేర్పులు చేసింది.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు గవర్నర్ ఆమోదం - NTR Health university Name Changed
NTR Health University: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం లభించటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు వైయస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ