ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేయండి మహాప్రభో: మైలవరం రైతులు - ఎన్టీఆర్ జిల్లా లోకల్ వార్తలు

Mylavaram formers fire on AP Govt: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వ్యవసాయ కేంద్రం నిర్మాణ పనులను.. నేటి ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిందని.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయ వ్యవసాయ సంచాలకుడు, వ్యవసాయ అధికారి కార్యాలయం అందుబాటులో లేక స్థానికులు, రైతులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. దాదాపు 90 శాతం పనులు గతంలోనే పూర్తయినప్పటికీ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి..పెండింగ్‌లో ఉన్న 10 శాతం పనులను త్వరగా పూర్తి చేసి.. కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Vyavasaya
Vyavasaya

By

Published : Feb 20, 2023, 12:16 PM IST

మైలవరం వ్యవసాయ కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేయండి..

Mylavaram formers fire on AP Govt: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారంలోకి వచ్చిన తరువాత అర్ధాంతరంగా వదిలేసింది. గతంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తి అయినప్పటికీ.. కేవలం 10 శాతం పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. దీని వల్ల అధికారులు, సిబ్బందితో పాటు.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. మైలవరంలో నిర్మాణ దశలో ఉన్న సహాయ వ్యవసాయ సంచాలకుడు, వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.

అధికారులను అన్నదాతలకు దగ్గర చేసి.. పంటల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడమే లక్ష్యంగా వ్యవసాయ కార్యాలయాలు పని చేస్తాయి. అలాంటి వ్యవసాయ కేంద్రం నిర్మాణం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని సహాయ వ్యవసాయ సంచాలకుడు, వ్యవసాయాధికారి కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో.. నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2018లో పనులు ప్రారంభించిన 90 శాతం మేర పూర్తి చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మిగిలిన పనుల గురించి పట్టించుకోవడమే లేదు. తీరిగ్గా రెండు వారాల క్రితం పనులు ప్రారంభించినా.. మొక్కుబడి తంతులా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

టీడీపీ హయంలో దేవినేని ఉమా.. ఈ కార్యాలయాన్ని డెవలప్ చేసి, రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఓ బిల్డింగ్‌ను నిర్మించాలనే ఉద్దేశ్యంతో అప్పట్లోనే రూ.35లక్షలు శాంక్షన్ చేసి, దాదాపు 90శాతం నిర్మాణాన్ని చేపట్టారు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 శాతం పనులు పూర్తి చేయకుండా రివర్స్ టెండర్ పేరుతో పూర్తిగా అట్లాగే ఉంచింది. దీంతో కార్యాలయంలో ఉండి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు..ఊరికి దూరంగా ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీని వల్ల రైతులు చాలా ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 10శాతం పనులు పూర్తి చేసి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. - రైతు, మైలవరం

ప్రస్తుతం మైలవరం శివారు మార్కెట్ యార్డులో ఉన్న రైతుభరోసా కేంద్రం నుంచి.. వ్యవసాయ అధికారి కార్యకలాపాలు సాగుతున్నాయి. బాగా దూరంగా ఉండటంతో తమ సందేహాలు, సమస్యలు అధికారులతో చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటోందని.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం మధ్యలో ఉన్న కార్యాలయాన్ని శివార్లకు తరలించి ఏళ్లు గడుస్తున్నా.. కొత్త భవనంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న 10 శాతం పనులను త్వరగా పూర్తి చేసి.. కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details