Sc, St Sub Plan : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో పదేళ్లు పెంచింది. సబ్‌ప్లాన్ గడువును పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పదేళ్ల గడువుతో రూపొందించి 2013లో జనవరి 24 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం గడువు రేపటితో ముగియనుంది. చట్టానికి గడువు దగ్గర పడుతుండటంతో పదేళ్లు పెంచాలని.. ఇటీవల ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం ఆ మేరకు చట్టం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రస్తుతం ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రానున్న శాసన సభ సమావేశాల్లో చట్ట సవరణ చేయనుంది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు.. మరో పదేళ్లు పొడిగించిన ప్రభుత్వం - ఎస్టీ సబ్ ప్లాన్
Sc, St Sub Plan : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు తేదిని మరో పది సంవత్సరాలకు పొడిగించింది. ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయనుంది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం