AP Formation day: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో.. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయుధ, సీఆర్పీఎఫ్ దళాలు కవాతు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు - నవంబర్ 1 ఏపీ ఆవిర్భావ దినోత్సవం
AP Formation day: రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నంద్యాల జిల్లా కలెక్టర్ మనిజర్ జిలాని, జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఆర్యవైశ్య సంఘాల నాయకులు.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, నగర మేయర్ సుజాత.. వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వైకాపా కార్యాలయంలో... ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు... అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో.. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో.. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి.. స్పీకర్ తమ్మినేని సీతారాం నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. శ్రీకాకుళంలోని పాత బస్టాండ్ కూడలిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి.. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ నివాళులు అర్పించారు.
ఇవీ చదవండి: