ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ చలవతో మనమే నెంబర్ వన్ - ఎందులోనో తెలిస్తే షాక్​ అవుతారు! - ఏపీలో నిరుద్యోగం

AP First Rank in Unemployment: ఎట్టకేలకు జగన్‌ ఏలుబడిలో నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాధించింది. ఎందులో అనుకుంటున్నారా? బీహార్‌ను వెనక్కి నెట్టేసి మరీ పట్టభద్రుల నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక నివేదికలో అత్యధికంగా రాష్ట్రంలోనే 24 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు తోడ్పాటునిచ్చే నైపుణ్య విశ్వవిద్యాలయాలు వైఎస్సార్సీపీ పాలనలో కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ నిర్వాకంతో కొత్త పరిశ్రమలు రాక ఉన్నవి తరలిపోవడంతో పట్టభద్రులకు పొట్టతిప్పలు తప్పడం లేదు.

AP_First_Rank_in_Unemployment
AP_First_Rank_in_Unemployment

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 8:20 AM IST

జగన్ చలవతో నిరుద్యోగంలో మనమే నెంబర్ వన్-పీరియడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వెల్లడి
AP First Rank in Unemployment : ఆకలిరాజ్యం సినిమాలో పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదా? ఇది 1980 నాటి యువత నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపే కథాంశంతో తీసిన 'ఆకలి రాజ్యం (Aakali Rajyam)' సినిమాలోనిది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జగన్‌ పాలనలో మళ్లీ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ చదివిన వారి పరిస్థితి ఇలానే తయారైంది.

Unemployment Rate Under CM Jagan Government :రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు 24శాతం ఉండగా జాతీయ సరాసరి 13.4శాతంగా ఉంది. జాతీయ సరాసరి కన్నా 11 శాతం అధికంగా రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ చదువుకున్న వారిలో నిరుద్యోగం ఉంది. జాతీయ సగటు కంటే నిరుద్యోగంలో 12 రాష్ట్రాలు పైన ఉంటే వాటిల్లో ఏపీదే అగ్రస్థానం. పక్క రాష్ట్రమైన తెలంగాణ 9వ స్థానంలో ఉండగా తమిళనాడు 10 స్థానంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో జాతీయ సగటు కంటే తక్కువగా 9.4 శాతం నిరుద్యోగిత ఉంది. అన్నింటిలోనూ వెనుకబడిన బిహార్‌ కూడా గ్రాడ్యుయేషన్‌ చదువుకున్న వారి నిరుద్యోగ రేటులో ఏపీ కన్నా మెరుగ్గా ఉంది.

నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత

Periodic Labor Force Survey on Unemployment : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (Periodic Labor Force Survey) నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది. జులై 2022 నుంచి జూన్‌ 2023 వరకు నిర్వహించిన సర్వే వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. నిరుద్యోగ రేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉండడం రాష్ట్రంలోని నిరుద్యోగుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

CM Jagan Government Increasing Unemployment Graduates :గ్రాడ్యుయేషన్‌ చదివిన మహిళల్లో 34.6శాతం నిరుద్యోగత ఉండగా పురుషుల్లో 20.3శాతంగా ఉంది. మహిళల జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 20.6శాతం కంటే ఏపీలో 14శాతం అధికంగా ఉంది. పురుషుల్లో జాతీయ సగటు 11.2శాతం కాగా రాష్ట్రంలో నిరుద్యోగత 9శాతం ఎక్కువగా ఉంది. పట్టభద్రుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ గతేడాది విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహ సర్వేలోనూ వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్లో ఉపాధి లేనివారు 3.03శాతంగా ఉంటే పట్టభద్రుల్లో 35.14శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు. జాతీయ సగటు 17.23శాతం కంటే ఏపీలో రెండింతలు ఎక్కువ.

అంతర్జాతీయ స్థాయిలో సీఎం జగన్ గొప్పలు - రాష్ట్రంలో నిరుద్యోగులకు తప్పని తిప్పలు

Unemployment Situation in YSRCP Government :యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ సీఎం జగన్‌ అరచేతిలోనే వైకుంఠం చూపారు. ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. ఇంజినీరింగ్‌ వారికి హై ఎండ్‌ వర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పిన జగన్‌ దాన్ని అటకెక్కించారు. నైపుణ్య కళాశాలలను తూతూమంత్రంగా ఏర్పాటు చేసి, సరైన శిక్షణ లేకుండా చేశారు.

Unemployment Graduates in Andhra Pradesh :ప్రతిపక్షనేత చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం సీమెన్స్‌ లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నైపుణ్యాలున్న యువతను అందించే రాష్ట్రాలో ఏపీ స్థాయి ఏటా కిందకు పడిపోతూనే ఉంది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. బీటెక్, సాధారణ డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్‌లైన్‌ కోర్సులు, అదనపు అర్హతలు పెంచుకునేందుకు భారీగా వ్యయం చేస్తున్నారు.

Andhra Pradesh Registering Highest Unemployment Rate :రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. కొత్తవి రాకపోగా ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. విశాఖపట్నంలో అనేక అంకుర సంస్థలు మూతపడ్డాయి. IBM, HSBC లాంటి సంస్థలు వెళ్లిపోయాయి. సిరిపురంలోని HSBC కార్యాలయం, కాల్‌ సెంటర్లలో ఒకప్పుడు 3 వేలకుపైగా ఉద్యోగులు పని చేయగా ఆ సంస్థ ఖాళీ చేసి, వెళ్లిపోయింది. విజయవాడలో HCL, టెక్‌ మహీంద్రలాంటి సంస్థలున్నా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావడం లేదు.

UNEMPLOYMENT IN AP: వాళ్లల్లో 35శాతం మంది నిరుద్యోగులే.. తేల్చిచెప్పిన సీఎంఐఈ సర్వే

ABOUT THE AUTHOR

...view details