AP Electricity Regulatory Commission :విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్‌పై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. గురువారం నుంచి 3 రోజుల పాటు.. మూడు డిస్కమ్‌ల పరిధిలో వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో విచారణ జరపనుంది. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన.. విద్యుత్ టారిఫ్ ఆర్డర్‌లతో పాటు, ఆయా సంస్థల వార్షికాదాయ, వ్యయాలపై ఏపీఈఆర్సీ విచారణ చేపట్టనుంది. గృహ వినియోగదారులకు విద్యుత్ రీటైల్ సరఫరా ఛార్జీలతో పాటు స్మార్ట్ మీటర్ల వినియోగదారులకు యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున టీఓడీ ఛార్జీలు వేయనున్నట్టు డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.
విద్యుత్ టారిఫ్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్న ఏపీఈఆర్సీ
Discoms : విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాందిన విద్యుత్ టారిఫ్‌లపై ప్రజాభిప్రాయ సేకరించానున్నారు. ఈ సేకరణను ఏపీ విద్యుత్ నియంత్రాణ మండలి ఈ రోజు నుంచి చేపట్టనుండగా.. దీనిని వీడియో కాన్పరెన్సింగ్ విధానంలో సేకరించనుంది.
ఏపీఈఆర్సీ