ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ అనాలోచిత నిర్ణయాలతో వెనకబడిపోయాం.. జన చైతన్య వేదిక సదస్సులో వక్తలు - Former IRS officer Devi Prasad

DEVELOPMENT MEETING : ముఖ్యమంత్రి జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లోపం కారణంగా మనం అన్ని రంగాల్లో వెనకబడిపోయామని విజయవాడలో జరిగిన జనచైతన్య వేదిక అభిప్రాయపడింది. ఏపీ పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని వ్యక్తలు అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల దయాదాక్ష్యాణ్యాల మీద ప్రజలు బతికే పరిస్ధితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను జాగృతం చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పులను చెప్పేందకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ఆధ్యాయన వేదిక ముఖ్య భూమిక పొషిస్తుందని తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 4, 2023, 8:32 PM IST

Updated : Mar 5, 2023, 6:25 AM IST

DEVELOPMENT MEETING : ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ఆధ్యాయన వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆధ్యాయన వేదిక ఆవిర్భావ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఎఎస్ లు టి.గోపాలరావు, యల్.వి. సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, మాజీ ఐఆర్ఎస్ అధికారి దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్దికోసం నిపుణులు, మేథావులు చేసిన ఏ సూచనలను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని సభలో వక్తలు అన్నారు. హైదరాబాద్​లో ఉన్న సెస్ సంస్థ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం మారలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత అద్యాపకులు రంగయ్య విమర్శించారు. మానవ అభివృద్ధిలో మన దేశం వెనకబడి ఉందని, ఏపీ ఇంకా వెనుకబడి ఉందని వారు పేర్కొన్నారు. అభివృద్దికి దోహదపడే అనేక అంశాలపై తాము ఆధ్యాయన చేసి ప్రభుత్వాలకు నివేదికలు అందించే వేదికగా ..తాము ఉంటామని వారు వెల్లడించారు.

అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్​ది 30వ స్థానం: భారతదేశంలోని అక్షరాస్యతలో నేటికీ ఆంధ్రప్రదేశ్ 30వ స్థానంలో ఉందని ప్రోఫెసర్ డి.ఆర్ సుబ్రహ్మణ్యం, మాజీ ఐఆర్ఎస్ అధికారి దేవి ప్రసాద్ తెలిపారు. కేంద్రం ఏది అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదే అమలు చేస్తుందని వారు పేర్కొన్నారు. పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఏపీకి తీరని నష్టమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ పరిణామాలను పరిశీలించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని, కానీ వాటిని అభివృద్ది దిశగా ఉపయోగించడం లేదని విమర్శించారు. విజయవాడలో పురుడు పొసుకున్న ఈ ఆధ్యాయన వేదిక భవిష్యత్ తరాల ఉన్నతికి నాందిగా మారుతుందని చెప్పారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యలో, ఆరోగ్యంలో వెనకబడిపోయాం: ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎజెండాలు మారిపోతున్నాయని, ఇది మంచి పరిణామం కాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలరావు అన్నారు. ఏపీలో వనరులకు, మేదో సంపత్తికి కొదవు లేదని, అయినా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యలో, ఆరోగ్యంలో వెనకబడిపోయామని అన్నారు. పాఠశాల భవనాలకు రంగులు వేస్తే సరిపోదని, విద్యార్ధులు పాఠశాలను మద్యలోనే మానేయకుండా చూసుకోవాలని సూచించారు. చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణం కోసం చర్యలు చేపడితే తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేశారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ఫలాలు రెండు తెలుగు రాష్ట్రాలకు అందుతున్నాయని అన్నారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదేనని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆర్ధం కావడం లేదన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు పనికిరాకుండా చేశారని అన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు భూములు వెనక్కి ఇచ్చేస్తే వాళ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో బడ్జెట్ కు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు పొంతన లేదన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు.

పారిశ్రామిక రంగ అభివృద్ది పూర్తిగా దెబ్బతింది :రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ది పూర్తిగా దెబ్బతిందని ఏపీ అభివృద్ది ఆధ్యాయన వేదిక ప్రధాన కార్యదర్శి లక్ష్మణ రెడ్డి అన్నారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇచ్చాపురం నుంచి సత్యసాయి జిల్లా వరకూ ఎక్కడా రెండు వేల మంది పనిచేసే పరిశ్రమలే లేవని వేదిక అభిప్రాయపడింది. ఒక్క విశాఖలో మినహా, రెండు వేల మంది పనిచేసే పరిశ్రమలు ఎక్కడా లేవన్నవారు, ఈ మూడేళ్లలో కొత్త పరిశ్రమలు రాకపోవడానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ది పై ఆధ్యాయనం చేసి ఆ నివేదిక ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వక్తలు నిర్ణయించారు. .

ఇవీ చదవండి :

Last Updated : Mar 5, 2023, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details