ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

contract employee regularization: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కానీ..! - ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులు

ap contract employees: ఎన్నికల ముందు జగన్‌ మాట నమ్మిన వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనలతో... ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానికసంస్థల్లో పని చేస్తున్న మరో 50 వేల మంది ఒప్పంద ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 2014 జూన్‌ 2నాటికి అయిదేళ్లు సర్వీసు పూర్తైన వారినే క్రమబద్ధీకరిస్తామనే నిబంధన పెట్టారు. రెగ్యులర్‌ అవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని, కమిటీల పేరుతో కాలయాపన చేసి నాలుగేళ్ల తర్వాత కొందరికే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

cm jagan
ap contract employees

By

Published : Jun 8, 2023, 7:13 AM IST

AP Contract Employee Regularization సీపీఎస్ రద్దు చేస్తాం.. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసు ప్రకారం వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని కల్లబొల్లిమాటలతో ఏమార్చారు. పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక వైసీపీ... వైఎస్ఆర్ కోతల పార్టీగా మారిపోయిందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. భద్రతే లేదు..

మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పిన జగన్‌ ఇప్పుడు ఉద్యోగులను మోసం చేశారు.కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ఉద్యోగుల అర్హత, సర్వీసు ఆధారంగా వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి, ఇప్పుడు అతి తక్కువ మందిని క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు జగన్‌ మాట నమ్మిన వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్‌ 2నాటికి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే.... మన రాష్ట్రంలో మాత్రం 2014 జూన్‌ 2నాటికి అయిదేళ్లు సర్వీసు పూర్తైన వారినే క్రమబద్ధీకరిస్తామనే నిబంధన పెట్టారు.

దీంతో... వేల మంది ఉద్యోగులు అర్హత కోల్పోయారు. 2009 జులై నుంచి డిసెంబరు వరకు చేరినవారు కూడా అనర్హులవుతున్నారు. ఎన్నికల ముందు ఎలాంటి నిబంధనలు చెప్పని జగన్‌ ఇప్పుడు కోతలు వేస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. రెగ్యులర్‌ అవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని, కమిటీల పేరుతో కాలయాపన చేసి నాలుగేళ్ల తర్వాత కొందరికే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ నెరవేర్చామంటూనే క్రమబద్ధీకరించే ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం భారీగా తగ్గించేసిందని వాపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వాస్పత్రి డైట్‌ కాంట్రాక్టు బరిలో ముగ్గురు..కలెక్టర్‌ ఆఫీస్​కు చేరిన పంచాయితీ

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనలతో... ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానికసంస్థల్లో పని చేస్తున్న మరో 50 వేల మంది ఒప్పంద ఉద్యోగులకు నిరాశే మిగిలింది. విద్యాశాఖలోని 2 వేల మంది ఒప్పంద అధ్యాపకులు, 800 మంది సీఆర్​టీలు క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోయారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 316 మంది ఒప్పంద అధ్యాపకులు ఉంటే... వీరిలో 110 మంది మాత్రమే రెగ్యులరైజ్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న చాలా మంది క్రమబద్ధీకరణ పరిధిలోకి రావడం లేదు. చాలా విభాగాల్లో ఇదే దుస్థితి నెలకొంది. దీంతో నాలుగేళ్లగా గంపెడాశలు పెట్టుకున్న ఒప్పంద ఉద్యోగులకు ఎండమావులే మిగిలాయి.

పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌ దాన్నీ అమలు చేయడం లేదు. ఈ హామీ నెరవేర్చాలని ఉద్యోగులు ఎన్ని వినతులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీలో 32 శాతం జీతాలు పెంచమని చెప్పినా... చేతులెత్తేసింది. పెరిగిన ధరల ప్రకారం వేతనాలివ్వాలని కోరుతున్నా... వేతనాలు పెంచేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.

OPS SS అవగాహన లేకుండా సీపీఎస్​పై హామీ ఇచ్చామనడానికి సజ్జల ఎవరు! ఓపీఎస్ సాధన సమితి ఆవిర్భావ సభలో ఉద్యోగుల మండిపాటు

ABOUT THE AUTHOR

...view details