Another New Political Party in AP:రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ప్రారంభమైంది. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ (Another new political party) ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బారాయన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుబ్బారాయన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో పెన్షనర్లు లేరని తేల్చి చెప్పారు. పెన్షనర్లు ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని సకాలంలో జీతాలు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తమకు ఒక రాజకీయ వేదిక ఉండాలని ఆలోచనతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీని ఏర్పాటు చేశామని పి సుబ్బారాయన్ తెలిపారు.
AMARAVATI PADAYATRA : కడలి తరంగాలై.. కదిలివచ్చిన రాజకీయ పార్టీలు!
నిరుద్యోగులను తయారుచేసే కర్మాగారాలుగా కళాశాలలు:జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను, పెన్షనర్లను, రైతులను పట్టించుకోవడం పూర్తిగా మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కళాశాలల పరిస్థితి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా తయారైందని దుయ్యబట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు.. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను సారా దుకాణాల్లో పని చేసే వారిలా మార్చిందని సుబ్బారాయన్ మండిపడ్డారు. యువకులు రాష్ట్రంలో ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు (Unemployed youth in AP) తరలిపోతున్నారు.. వారు మాత్రమే కాకుండా వచ్చిన పరిశ్రమలు.. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు.