Anganwadi Workers Protest in AP :అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె పదో రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా కొనసాగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైలవరం ఎమ్పీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకని వినూత్నంగా నిరసన తెలియజేశారు. జగనన్న డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొండి వైఖరిని వదిలి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీఎం జగన్‌ని కొత్తగా ఏమీ కోరడం లేదని,గతంలో ఇచ్చిన హామీనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు.
Anganwadi Workers Problems in AP : కృష్ణా జిల్లా కంకిపాడులోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ తమ ఆకాంక్షలను చాటి చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్డీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని ఆందోళన చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లాలోని మంగళగిరిలో భారీ ర్యాలీ తీసి అనంతరం దుకాణాల్లో భిక్షాటన చేశారు.
ఇది సరైన సమయం కాదు - అంగన్వాడీల డిమాండ్లపై మంత్రి ఉషశ్రీ చరణ్
Anganwadi Agitation Statewide :ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు కూడలిలో రహదారికి ఇరువైపులా నిల్చుని ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.