Anganwadi protest 9th day :ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తోన్న సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించాలని విజయనగరం కలెక్టరేట్ అంగన్వాడీలు నిరసన చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళుతూ భిక్షాటన చేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా నిరసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైలవరంలో అంగన్వాడీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. సీఎం జగన్ నా అక్కాచెల్లెలు అంటూ నమ్మించి తమను రోడ్డున పడేసి భిక్షమెత్తుకునేలా చేశారని గుంటూరు ప్రధాన రహదారిపై అంగన్వాడీలు భిక్షాటన చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం: అంగన్వాడీలు
Anganwadi protest in andhra pradesh :బాపట్ల జిల్లా చీరాలలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులో సచివాలయ ఉద్యోగులు అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టే యత్నం చేయగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు తమకు మధ్య గొడవలు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో భిక్షాటన చేశారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద వంటావార్పు చేపట్టారు. అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిర్ నుంచి టవర్ క్లాక్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీలతో కలిసి చిన్నారుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు.