low cost Medical tests at Lakshmi Polyclinic Diagnostic Center: 'మానవ సేవే మాధవ సేవ' అంటూలక్ష్మీ పాలిక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యం సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే వైద్యాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. ఈసీజీ నుంచి మొదలుకొని ఎక్స్‌రే వరకూ సుమారు 126 రకాల వైద్య పరీక్షలను అతి తక్కువ ధరలకే అందిస్తోంది. అంతేకాదు, సాధారణ జ్వరాల నుంచి మధుమేహం, గైనకాలజీ వరకూ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఓపీ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఓపీ ధర రూ.300 నుంచి రూ.500 వరకూ ఉంది. కానీ, లక్ష్మీ పాలిక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కేవలం రూ.100కే ఓపీ సేవలు అందిస్తున్నారు. మరీ ఈ ఆసుపత్రి ఎక్కడుంది..?, ఏయే వైద్య పరీక్షలు చేస్తారు..?, ఒక్కో వైద్య పరీక్షకు ఎంతెంత ధరను నిర్ణయించారు..?, ఆసుపత్రి సమయ వేళలు ఎలా ఉన్నాయి..? అనే వివరాలను తెలుసుకుందామా..
లక్ష్మీ ఫౌండేషన్‌లో తక్కువ ధరలకే వైద్య పరీక్షలు.. సామాన్య ప్రజలకు ప్రస్తుతం వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైనా అనారోగ్యం వస్తే వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందించేందుకు లక్ష్మీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. విజయవాడలో ఆసుపత్రిని ప్రారంభించి.. వైద్యంతో పాటు వైద్య పరీక్షలను అతి తక్కువ ధరలకు అందిస్తోంది.వైద్య పరీక్షలు ప్రతి రోజు ఉదయం 7 గంటలను నుంచి ప్రారంభం అవుతాయని. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆసుపత్రిలో ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం పేర్కొంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య సేవలను.. ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని ఆసుపత్రి వైద్యులు విజ్ఞప్తి చేశారు.