ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Vs TS: 'మంత్రి మల్లారెడ్డి గారూ మీ పని చూసుకోండి.. ఏపీ వ్యవహారాల్లో తలదూర్చొద్దు' - brs news

AP Minister Meruga Nagarjuna fire TS Minister: ఏపీ-తెలంగాణ మంత్రుల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యనే తెలంగాణ మంత్రి హరీష్​రావు వ్యాఖ్యలు చేయగా.. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఘాటుగా స్పందించారు. మంత్రి మల్లారెడ్డి తన పని తాను చేసుకోకుండా.. ఏపీ వ్యవహారాల్లో తలదూర్చటం సమంజసం కాదని హితవు పలికారు.

AP Minister
AP Minister

By

Published : May 1, 2023, 8:02 PM IST

AP Minister Meruga Nagarjuna fire TS Minister: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఘాటుగా స్పందించారు. మంత్రి మల్లారెడ్డి తన పని తాను చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తలదూర్చటం సమంజసం కాదని హితవు పలికారు. తమ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు.

వివరాల్లోకి వెళ్తే.. గతకొన్ని నెలలుగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, విశాఖపట్టణంలోని ఉక్కు కార్మాగారం విషయంలో తెలంగాణ మంత్రులకు, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు తెలంగాణ మంత్రులకు లేదంటూ ఇక్కడి మంత్రులు.. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు లేదంటూ అక్కడి మంత్రులు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మేడేను పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము కేసీఆర్‌కే ఉంది. ఇంకెవరికీ లేదు. విశాఖపట్టణంలోని ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కాకుండా చేసే దమ్ము బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉంది. సీఎం కేసీఆర్ ఆలోచన.. మంత్రి కేటీఆర్ ఆచరణ.. కార్మికుల పనితనంతోనే.. తెలంగాణ రాష్ట్రం ప్రగతి భాటలో పయణిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టయిన కాళేశ్వరం.. కార్మికుల కృషితోనే సాధ్యమైంది.. యాదాద్రి పుణ్యక్షేత్రం, కొత్త సచివాలయం కూడా కార్మికుల కృషే. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో లేని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ లేనే లేదు. మంత్రి మల్లారెడ్డి అయితే.. ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టును కూడా కేసీఆరే పూర్తి చేస్తారు. దాన్ని పూర్తి చేసే దమ్ము ఇంకెవరికీ లేదు'' అని ఆయన అన్నారు.

తెలంగాణా మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''తెలంగాణా మంత్రి మల్లారెడ్డి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అన్న మాటలు.. గురివింద గింజ పోలికలో ఉన్నాయి. ఆయన తన పని తాను చేసుకోకుండా.. ఏపీ వ్యవహారాల్లో తలదూర్చటం సమంజసం కాదు. ఏపీలో ఏం జరుగుతోందో ఇక్కడి ప్రజలకు తెలుసు.. మంత్రి మల్లారెడ్డి. ఏపీలో పోటీ జగన్, చంద్రబాబుల మధ్యే. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా పని చేస్తోంది. ఏపీలో కులరాజకీయాలు చేసేది చంద్రబాబే. చంద్రబాబు హయాంలో రూ.33 వేల కోట్ల మేర సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తే.. వైసీపీ హయాంలో రూ. 49 వేల కోట్లు వ్యయం ఖర్చు చేశాం. ఎస్సీలకు స్వయం ఉపాధి నిమిత్తం కూడా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ నిధులు మా ప్రభుత్వమే ఇచ్చింది. దళితుల భుజాలపై తుపాకీ పెట్టి జగన్‌ను కాల్చాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు'' అని ఆయన అన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details