ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు

By

Published : Nov 29, 2022, 5:58 PM IST

IPS officer AB Venkateswara Rao: సీనియర్​ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఛీఫ్​ సెక్రటరీ హైకోర్టు ఆదేశాలు పాటించటం లేదని ఆయన హైకోర్టులో పిటిషన్​ ధాఖలు చేశారు.

high court
high court

IPS officer AB Venkateswara Rao: హైకోర్టు ఆదేశాలను పాటించటం లేదని చీఫ్​ సెక్రటరీపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చలేమని కోర్టు అభిప్రాయపడుతూ వెంకటేశ్వరరావు పిటిషన్​ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అవతవకలు జరిగాయంటూ గతంలో ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేస్తూ.. వెంకటేశ్వరరావుకు రావాల్సిన వేతనం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 22 నుంచే పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లిస్తున్నారనీ.. హైకోర్టు ఆదేశాల ప్రకారం సస్పెన్షన్ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details