ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలోనే సెక్స్ వర్కర్లు ఎక్కువ..! నివ్వెరపరుస్తున్న కేంద్ర గణాంకాలు

Sex Workers : పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి ఈరోజుల్లోనూ చాలామంది మహిళలు వెళ్లక తప్పడం లేదు. దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. వేశ్యా వృత్తిలోకి ప్రవేశించేవారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. దేశంలో మహిళా సెక్స్‌ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తుంది.

Women Sex Workers
మహిళా సెక్స్‌ కార్మికులు

By

Published : Jan 10, 2023, 10:01 AM IST

Updated : Jan 10, 2023, 11:52 AM IST

Women Sex Workers : పడుపు వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కొందరు విలాసాలకు అలవాటు పడటంతో ఈ వృత్తిలోనికి వచ్చే వాళ్లు ఏటా పెరుగుతున్నారు. 10 నుంచి 15శాతం మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్నవారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటోంది. ఇదేవిధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు 10శాతం వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి . దేశంలోనే హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 3.94 లక్షలు, కర్ణాటకలో 2.76 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.

దేశంలో 2021 జనవరి నుంచి అదే ఏడాది సెప్టెంబరు మధ్య చేసిన అధ్యయనం ప్రకారం 8 లక్షల 25 వేల 55 మంది మహిళా సెక్స్‌ వర్కర్లున్నారు. వీరిలో లక్షా 33 వేల 447 మంది సెక్స్‌ వర్కర్లతో ఏపీది తొలి స్థానం. 2005లో రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ప్రస్తుతమున్న ఏపీ పరిధిలో 65వేల మంది సెక్స్‌ వర్కర్లు నివసిస్తున్నారు. 2022నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటింది. ఉమ్మడి అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కోచోట 17వేల మందికిపైగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 13 వేల 781, కర్నూలులో 12 వేల 709, చిత్తూరు జిల్లాలో 10 వేల 296 మంది చొప్పున ఉన్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 6వేల నుంచి 8వేల మధ్యన ఉన్నారు. కడప, విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2వేల నుంచి 4వేల మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాస్త తక్కువ. కష్టపడి పనిచేసుకుని జీవించేందుకు ప్రయత్నిస్తే సమాజం తమను నమ్మట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

"కావాలని ఈ వృత్తిలోకి ఎవరు రారు. ప్రేమించిన వాడు మోసం చేయటం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక, భర్త సరైన వాడు కాక, కుటుంబ పోషణ లేక ఇలా చాలా మంది చాలా రకాలుగా వస్తున్నారు. బయటికి వెళ్లి ఎదైనా పని చేసుకుందమని వెళ్తే మమ్నల్ని తప్పుడు ఉద్దేశ్యంతోనే చూస్తుంటారు. కొంతమందైతే నిన్ను అక్కడు చూశాము కదా అని సూటిపోటీ మాటలు అంటుంటారు." -సెక్స్​ వర్కర్

వేశ్యా వృత్తి ఆధారంగా స్థానికంగా జీవించే సెక్స్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉంది. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ, సేవా సంస్థల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వీరి సంఖ్య ఎక్కువ. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఎక్కువే. ఈ జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి కడప జిల్లాలో వీరి సంఖ్య తక్కువ. కరవు కాటకాలు, జీవనోపాధి దొరక్క సీమలో చాలా మంది ఈ కూపంలో కూరుకుపోతున్నారు. ఈ జిల్లాల మీదుగా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వెళ్లే జాతీయ రహదారులు ఉండటమూ ఈ సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ఈ సెక్స్‌వర్కర్లలో 1,450 మందికి హెచ్‌ఐవీ సోకినప్పటికీ మందులు వాడుతూ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఏపీకి పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి వేశ్యా వృత్తిలో ఉన్నవారు 11 వేల 639 మంది ఉన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, అసోం, బిహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నిర్మాణ, ఇతర రంగాల్లో పని చేస్తున్న కొందరు వేశ్యావృత్తిని కొనసాగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలసవెళ్లి మహారాష్ట్రలో పడుపు వృత్తిలో ఉన్నవారు 6 లక్షల 6 వేల 689 మంది ఉన్నారు.

"మహిళ సెక్స్​ వర్కర్స్​ మొదటి నుంచే ఉంది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఎక్కువగా ఉంటారు అని. అవి ఇప్పటికి కొనసాగుతునే ఉన్నాయి. ఈ వృత్తిలోకి చిన్నపిల్లలను ఎక్కువగా ట్రాక్​ చేస్తున్నారు. పక్కనున్న వాళ్లు చెప్తారు.. పలానా దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి వస్తావా. ఒకవేళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక.. డబ్బులు అవసరమై వెళ్తున్నారు." -రాజేంద్రప్రసాద్ పెప్ ఫర్ కో ఆర్డినేటర్

"మాకు ట్రాక్​ అయిన వారు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు. వాళ్లందరికి కౌన్సిలింగ్​ ఇస్తున్నాము. వారు ఈ వృత్తిలోకి రాక ముందు వారిక ఏం సమస్యలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు బాగాలేక వచ్చార, ఎవరైనా ప్రొత్సహించటం వల్ల వచ్చారా, ఎవరైనా వేధించి తీసుకువచ్చార అని తెలుసుకుంటున్నాము. కొన్నిసార్లు పోలీసుల సహాయం కూడా తీసుకుంటాము." -కిషోర్ ,ఏపీ శాక్స్ జేడీ

స్వలింగ సంపర్కులు దేశవ్యాప్తంగా లక్షా 66 వేల 844 మంది ఉన్నారు. 25 వేల 690 మందితో ఈ జాబితాలో ఏపీది మూడో స్థానం. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. తమిళనాడులో 46 వేల 859, కర్ణాటకలో 34 వేల 988 మంది చొప్పున స్వలింగ సంపర్కులు ఉంటున్నారు. హిజ్రాలు దేశవ్యాప్తంగా 57 వేల 934 మంది ఉండగా 4 వేల 157 మంది ఉన్న ఏపీది ఐదో స్థానం. జీవనోపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీ డ్రైవర్లు, క్లీనర్లు దేశవ్యాప్తంగా 30వేల మంది వరకు సెక్స్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ కేటగిరీలో ఏపీది 15వ స్థానం.

మహిళా సెక్స్‌ కార్మికులు ఏపీలోనే అధికం

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details