ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Govt approached Supreme Court on R5 zone: అమరావతి ఆర్-5 జోన్‌ అంశంపై సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన రాష్ట్రప్రభుత్వం - Andhra Pradesh today news

supreme
అమరావతి ఆర్-5 జోన్‌ అంశంపై సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన రాష్ట్రప్రభుత్వం

By

Published : Aug 8, 2023, 5:55 PM IST

Updated : Aug 8, 2023, 6:43 PM IST

17:46 August 08

ముందుగా తమ వాదనలు వినాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన రాజధాని రైతులు

AP Govt Filed SLP in Supreme Court on R5 zone: అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)కు వెళ్లింది. ఇటీవలే రాష్ట్ర హైకోర్టు ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై ఇచ్చిన స్టే పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నంబర్ కేటాయించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే..ముందుగా తమ వాదనలూ వినాలని ఇప్పటికే అమరావతి రైతులు సుప్రీం కోర్టులో కేవియట్ వేశారు.

ఆర్‌-5 జోన్‌‌లో ఇళ్ల నిర్మణంపై హైకోర్టు స్టే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌‌లో బయటి ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలివ్వడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం, పట్టాలు ఇవ్వడంపై రాజధాని రైతులు.. హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఆ పిటిషన్‌లపై పలుమార్లు విచారించిన ధర్మాసనం.. ఆగస్టు 3వ తేదీన సంచలన తీర్పును వెలువరించింది. జగన్‌ ప్రభుత్వం ఆర్-5 జోన్‌లో నిర్మించబోయే ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

High Court on R5 Zone: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

అలా నిర్మించడం విస్తృత ప్రజాప్రయోజనాలకు విరుద్ధం.. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను మార్చి, ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, బయటి ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలివ్వడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ.. దాఖలైన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగానే..రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇళ్లు నిర్మించడం విస్తృత ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. రాజధానిలో బయటి ప్రాంతాల వారికి ఇచ్చిన ఇళ్లపట్టాలపై.. కోర్టు తుది తీర్పునకు లోబడే లబ్ధిదారులకు హక్కు దాఖలు పడుతుందని.. సుప్రీంకోర్టే విస్పష్టంగా చెప్పిన విషయాన్ని జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులు, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.

R5 zone Issue: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తీర్పులు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం నష్టపోవాల్సిందే.. ఇంటి స్థలంపై హక్కు విషయంలోనే సుప్రీంకోర్టు అంత స్పష్టంగా చెప్పినప్పుడు.. అక్కడ ఇళ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో న్యాయపరంగా, తీవ్రంగా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, వాటిపై విసృత చర్చ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశాలపై స్పష్టత రావాలంటే పూర్తిస్థాయిలో విచారణ జరగాలని పేర్కొంది. భూమి నిమిత్తం సీఆర్‌డీఏకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం, ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన మొత్తం కలిపి.. సుమారు రూ. 2,000 కోట్లు ప్రభుత్వం అక్కడ ఖర్చు చేయనుందని, అదంతా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మని, రేపు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. అదంతా నష్టపోవాల్సిందేనని కోర్టు పేర్కొంది. ప్రజల సొమ్మును ప్రభుత్వం తన ఇష్టానికి వృథా చేస్తుంటే.. కోర్టు ప్రేక్షకపాత్ర వహించబోదని స్పష్టం చేసింది. కోర్టుల నుంచి తుది తీర్పు వెలువడేంత వరకు ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని స్పష్టం చేసింది.

ఆర్-5 జోన్‌లో ఇళ్లపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇళ్ల నిర్మాణాల విషయంలో ఇచ్చిన స్టేపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నంబర్ ఇచ్చారు.

capital farmers Mahadharna: 'భూముల కౌలు ఇవ్వరా.. బుద్ధి చెప్తాం' రాజధాని రైతుల మహాధర్నా

Last Updated : Aug 8, 2023, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details