ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EMPLOYEES UNIONS WITH CM: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఉద్యోగ సంఘాలు - Andhra Pradesh govt employees news

GOVT EMPLOYEES UNIONS LEADERS MEET WITH CM JAGAN: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ..ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు సీఎం జగన్‌ను కలిశారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

UNIONS MEET WITH CM
UNIONS MEET WITH CM

By

Published : Jun 9, 2023, 4:49 PM IST

GOVT EMPLOYEES UNIONS LEADERS MEET WITH CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకటన, బకాయిల చెల్లింపులపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. సీఎంకు పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువతో సత్కరించారు.

సీఎంకు ధన్యవాదాలు.. ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవో నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాబినెట్‌లో 12వ పీఆర్సీ ప్రకటిస్తామన్నందుకు, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నందుకు, బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటమన్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు, మంత్రుల కమిటీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

మంత్రివర్గ నిర్ణయాలను 60రోజుల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు

అంతేకాకుండా.. ''అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేని పింఛను ఇవ్వాలని సీఎంను కోరాం. కాంట్రిబ్యూషన్ లేని విధానం భారమవుతుందని కూడా సీఎంకు వివరించాం. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నాం. జీపీఎస్‌లో ఏ ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశాం. పీఆర్‌సీ ఛైర్మన్‌గా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదు'' అని బండి శ్రీనివాస్‌ అన్నారు.

జీపీఎస్‌..రిటైర్ ఉద్యోగులకు భద్రతా కల్పిస్తుంది.. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఓపీఎస్ తెస్తామని హామీ ఇచ్చిందని, తాజాగా ఓపీఎస్‌తో సమానంగా లబ్ధి కలిగించేలా జీపీఎస్‌ను తీసుకొచ్చిందని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారికి భద్రత కల్పించేలా ఈ జీపీఎస్‌ను అమల్లోకి తెచ్చామన్నారు. జీపీఎస్ తీసుకువచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. జీపీఎస్.. దేశానికి రోల్ మోడల్‌గా ఉంటుందని, జీపీఎస్‌తో ఎటువంటి నష్టం ఉండకుండా మేలే జరుగుతుందని సీఎం జగన్ చెప్పారని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాల డిమాండ్‌పై సీఎం జగన్ సానుకూలత వ్యక్తం చేశారని ఆయన తెలియజేశారు.

అనంతరం ఉద్యోగుల విషయంలో తాజాగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటం, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటుతోపాటు రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలను అన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానిస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నాయనీ వెంకట్రామిరెడ్డి వివరించారు.

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం ముగించాం..ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాలతో.. ఏపీ జేఏసీ అమరావతి ఆందోళనలు, ఉద్యమాలను గురువారంతో ముగించామని ఆ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. తమ సంఘం నుంచి ప్రభుత్వానికి ఇచ్చిన 47 డిమాండ్లలో 37 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను పునర్ వ్యవస్థకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు బొప్పరాజు తెలిపారు. అనంతరం ఓపీఎస్‌ విధానం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని బొప్పరాజు పేర్కొన్నారు. జీపీఎస్‌ అమలుకు ముందు మరోసారి సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బొప్పరాజు డిమాండ్ చేశారు.

16శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయటం సంతోషకరం.. మరోవైపు రెండు నెలలు ముందుగానే 12వ పీఆర్సీని ప్రకటించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి కర్నూలులో ఏపీ ఎన్జీవో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఉద్యోగ సంఘాల నేతలు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో ఉద్యోగులకు 16శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details