MLC Anantha Babu Bail Issue: ఎమ్మెల్సీ అనంత బాబు ఓ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే.. ఆయన పేరు శిలాఫలకాల మీద ఎలా వేస్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. అనంతబాబు జైలు నుంచి వచ్చేదాకా కొన్ని ప్రారంభోత్సవాలు ఆపేస్తారా అని మండిపడ్డారు. అనంతబాబు సచ్చీలుడని చెప్పే ప్రయత్నం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు మా బంధువులు, మేనత్త, మేనమాలని జగన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. దళితులు జగన్ను నమ్మి ఓట్లేస్తే.. అధికారంలోకి వచ్చాక ఆయన అసలు స్వరూపం బయటపడిందని ఎద్దేవా చేశారు.
ఓ దళితుణ్ని హత్య చేసిన అనంత బాబు జైల్లో ఉంటే శిలాఫలకాల మీద పేర్లు ఎలా వేస్తారు. వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు ఓ దళితుణ్ని చంపి డోర్ డెలివరీ చేస్తే.. కేసు దర్యాప్తు చేయడానికే పోలీసులు ఇష్టపడలేదు. అనంతబాబుకు బెయిల్ ఇప్పించేందుకు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహకరించే విధంగా వ్యవహరించారు. అనంతబాబు బయటకు రావడంతో సుబ్రమణ్యం కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. -వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు