చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ప్రధాన భద్రతా అధికారికి గాయాలు - నందిగామలో చంద్రబాబు రోడ్‌షో
18:32 November 04
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బాదుడే బాదుడు నిరసన రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబుపైకి ఓ దుండగుడు రాయి విసరడం కలకలం రేపింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుకి గాయాలయ్యాయి. తన పర్యటనలో పోలీసులు భద్రత సరిగ్గా లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా గూండాలు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైకాపా రౌడీలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. గాయపడ్డ సీఎస్‌వో మధుబాబుకు వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు. గడ్డం కింది భాగంలో మధుబాబు గాయమయ్యింది.
ఇవీ చదవండి: