Amaravati JAC leaders on padayatra: అమరావతి టు అరసవెల్లి మహాపాదయాత్రపై ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి.. వైకాపా నాయకులు ఓర్వలేక పోతున్నారని అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు రాయపాటి శైలజ అన్నారు. కోర్టు తీర్పును పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుని.. రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని విజయవాడలో అమరావతి బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పుపై పోలీసులకు పూర్తిగా స్పష్టతనిచ్చేందుకు దీపావళి అనంతరం హైకోర్టును ఆశ్రయించి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మద్దతుతో అరసవిల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
'పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు' - amaravati jac leaders
Amaravati JAC leaders on padayatra: పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైకాపా నాయకులు ఓర్వలేక పోతున్నారని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. కోర్టు తీర్పును పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకొని రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి అనంతరం హైకోర్టును ఆశ్రయించి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.
రాయపాటి శైలజ
రైతుల పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతుందని బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. జగన్కు తన ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం ఉంటే ప్రజల్లోకి వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అందరూ రాజీనామా చేసి వస్తే.. అమరావతి రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్దామా అంటూ ప్రశ్నించారు. ప్రజల మద్దతు ఎవరికీ ఉందో తేలిపోతుందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.
ఇవీ చదవండి: