Amaravati Farmers: అమరావతి రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలపై అమరావతి రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రామసభలు నిర్వహించకుండానే నిరభ్యంతర పత్రాలు అడుగుతున్నారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అభ్యంతర పత్రాల స్వీకరణకు గ్రామసభలు నిర్వహించేలా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని రైతులు పిటిషన్‌లో కోరారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణను చేపట్టింది. గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన 17 గ్రామాల్లో మరో రెండు రోజుల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించింది.
ఆ 17 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించండి: హైకోర్టు - High Court bench on Amaravati farmers
Amaravati Farmers: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రామసభలు నిర్వహించకుండానే నిరభ్యంతర పత్రాలు అడుగుతారని లంచ్మోషన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారించిన కోర్టు... రెండు రోజుల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించింది.
హైకోర్టు