నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాల ఆవరణలో కేవీఆర్కళాశాల వ్యవస్థాపకులు, నందిగామ మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి సూర్యనారాయణరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, వసంత నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రామోజీ ఫిలిం సిటీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, కళాశాల పాలకవర్గం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఎర్రంరెడ్డి బాబురావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. నందిగామ ప్రాంతంలో విద్యాభివృద్ధికి సూర్యనారాయణరావు కృషి చేశారని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన కళాశాలలో ఎంతోమంది విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి వెళ్లారని తెలిపారు. ఉద్యోగుల నియామకం నుంచి అన్ని విషయాల్లోనూ నిస్వార్ధంగా, నిజాయితీగా పని చేశారని కొనియాడారు.