Adulterated petrol in petrol station in Hanumakonda district: తెలంగాణ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణి గూడెంలోని పెట్రోల్‌తో పాటు నీరు కలిపి వస్తుందని బాధితులు స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఆందోళన చేశారు. ఏంటని ప్రశ్నించిన వారిని బంక్‌లో పనిచేసే సిబ్బంది బెదిరించారని బాధితులు వాపోయారు. ఈ విధంగా కల్తీ పెట్రోల్ బాహటంగా అమ్ముతున్నా అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు పెట్టి కొన్న వాహనాలు ఇలా కల్తీ పెట్రోల్‌తో పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ బంక్‌లో నీళ్లు కలిపిన పెట్రోలే అమ్ముతారు..! - కల్తీ పెట్రోల్
Adulterated petrol in petrol station in Hanumakonda district: పెట్రోల్ ధరలే జనాల్లో భయం పెడుతుంటే దానికి కల్తీ పెట్రోల్ కూడా తోడు అయింది. నేరుగా బంక్‌లోనే నీరు కలిపి అమ్ముతున్నారని స్థానికంగా బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన తెలంగాణ లోని హనుమకొండ జిల్లాలో ఓ పెట్రోల్ బంక్‌లో జరిగింది.
petrol
"పెట్రోల్ కొట్టించడానికి బంక్‌కి వెళ్తే పెట్రోల్ రంగులో లేకుండా తెలుపు రంగులో ఉంది. నాతో పాటు వచ్చిన ఒక వ్యక్తి బైక్‌లో కాకుండా వాటర్ బాటిల్‌తో పెట్రోల్ కొట్టించాడు. అది చూసి అనుమానం వచ్చింది. ఇది ఏంటిని సిబ్బందిని అడిగితే ఇక్కడ ఇలానే ఉంటుంది ఏమి చేసుకొంటారో చేసుకోండి అని సమాధానం ఇచ్చారు."- గొంగళి శ్రావణ్ , బాధితుడు
ఇవీ చదవండి