Adulterated Milk : కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్వోటీ పోలీసులు కల్తీ పాలను తయారు చేసి హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం వేలాది లీటర్లను సరఫరా చేస్తున్న వారిని పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం నుంచి తెల్లవారుజామున వాహనాల్లో హైదరాబాద్‌కు కల్తీ పాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మీరు తాగేవి స్వచ్ఛమైన పాలేనా.. ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఉంటారు జాగ్రత్త..!
Adulterated Milk: ధనార్జనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతి వస్తువునూ కల్తీ చేస్తున్నారు. చివరికి పసిపిల్లలు తాగే పాలనూ వదలడం లేదు. తాజాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేశారు.
కల్తీ పాలు
వారి వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, పాల తయారీకి ఉపయోగించే కెమికల్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్వోటీ పోలీసులు భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: