Adjournment of Hearing on PT Warrant in Fibernet Case: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సీఐడీ నమోదు చేసిన ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై వాదనలు రేపటి (గురువారం)కి వాయిదా పడ్డాయి. పీటీ వారెంట్‌కు సంబంధించి.. సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. న్యాయవాది వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్ట్.. తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ACB Court Hearing on PT Warrant: ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కేసు వివరాలు, ఎందరిని అరెస్టు చేశారనే విషయాలను సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద జడ్జికి వివరించారు. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని న్యాయవాది వాదించారు. దీంతో పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీకోర్టు సమ్మతించింది. అనంతరం తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.
Advocate VV Lakshminarayana on High Court Interim Orders: 'స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు భావిస్తే చంద్రబాబుకు బెయిల్'
Right to Audience Petition Dismissed: ఈ క్రమంలో కాల్ డేటా పిటిషన్‌పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. దానికి ఏసీబీ కోర్టు అంగీకరిస్తూ.. గురువారం మధ్యాహ్నం వాదనలు వింటామని పేర్కొంది. అంతకు ముందు చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. పిటిషన్ డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.
CID Case Against Chandrababu: ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కేసులో 114.53 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని పేర్కొంటూ.. సీఐడీ అధికారులు చంద్రబాబుతో సహా పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పీటీ వారెంట్‌పై చర్చ సమయంలో తమ వాదనలు కూడా వినాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు గతవారం రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పీటీ వారెంట్లపై విచారణ ప్రారంభానికి ముందు రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఫైబర్ నెట్ కేసులో వాదనలు వినిపించేందుకు సీఐడీ తరఫు న్యాయవాదికి అనుమతించగా.. సీఐడీ న్యాయవాది వివేకానంద సుదీర్ఘంగా కేసు పూర్వాపరాలను వివరించారు.
Dhulipalla Narendra on IRR Investigation Officer: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. విచారణ అధికారిని ఎందుకు మార్చారు జగన్? : ధూళిపాళ్ల
Arguments of CBN Lawyers:ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు చంద్రబాబును విచారించాల్సి ఉన్నందున సీఆర్‌పీసీ 267 ప్రకారం.. కోర్టులో హాజరుపరచాలని కోరారు. అప్పుడు తాము కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. సీఆర్‌పీసీ 267 ప్రకారం ఒక కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పలు కేసులను ఉదాహరణగా ప్రస్తావించారు. తన వాదన సమయంలో సీఐడీ న్యాయవాది లేవనెత్తిన అంశాలపై చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
Chandrababu Petitions in AP High Court: అప్పటివరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు