Amani In Sankranthi Celebrations: తెలుగు పండుగుల ప్రాముఖ్యత గురించి నేటి తరం పిల్లలకు ప్రతి ఒక్కరు తెలియ చేయాలని ప్రముఖ నటి ఆమని తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ భవానీ ద్వీపానికి నటి ఆమని విచ్చేశారు. పల్లెటూరి వాతావరణం ఉట్టి పడేలా భవానీ ద్వీపం మధ్యలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పల్లెటూరిని తలపించేలా విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు.
తెలుగు పండుగుల ప్రాముఖ్యత గురించి నేటి తరం పిల్లలకు ప్రతి ఒక్కరు తెలియ చేయాలి: ఆమని - ఏపీలోని భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు
Amani In Sankranthi Celebrations: సంక్రాంతి పండగను పురస్కరించుకొని వేడుకలు జరుగుతున్న విజయవాడ భవానీ ద్వీపానికి ప్రముఖ నటి ఆమని వెళ్లారు. అక్కడ పల్లెటూరి వాతావరణం, ఆటలు, పాటలు, కోలాటాలు ఆమెను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలకు తనను ఆహ్వానించిన మంత్రి రోజాకి ధన్యవాదాలు తెలిపారు.
ఆమని
చిన్నప్పుడు అందరూ అమ్మమ్మ వాళ్ల ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకునే వాళ్లమని, మళ్లీ అంటువంటి పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు సంప్రదాయలు అంటే ఏమిటో ఇప్పుడున్న పిల్లలకు తెలియడం లేదని వారు టీవీ, కంప్యూటర్లకే అంకితం అవుతున్నారని వివరించారు. మంత్రి రోజా ఏపీలో పర్యాటక శాఖను అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు. ఈ సంక్రాంతి సంబరాలకు మంత్రి రోజా తనను ఆహ్వానించారని అందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి: