ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Achchennaidu on Fiber Grid Case: ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌కు సంబంధం లేదని ప్రభుత్వమే క్లీన్​చిట్ ఇచ్చింది: అచ్చెన్నాయుడు - Achchennaidu news

Achchennaidu on Fiber Grid Case: ఫైబర్ గ్రిడ్ కేసు లోకేశ్‌కు సంబంధం లేదని హైకోర్టులో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైందని మండిపడ్డారు. 'బాబుతో నేను, రిలే నిరాహారదీక్ష'లు ఈనెల 9 వరకూ కొనసాగుతాయని ప్రకటించారు.

Achchennaidu_on_Fiber_Grid_Case
Achchennaidu_on_Fiber_Grid_Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 4:14 PM IST

Achchennaidu on Fiber Grid Case:'ఫైబర్ గ్రిడ్ కేసు లోకేశ్‌కు సంబంధం లేదని నిన్న కోర్టులో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది. న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైంది. ప్రభుత్వం కక్షసాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోంది. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలని జగన్‌ తాపత్రయపడుతున్నాడు. హడావుడిగా రేపు దిల్లీ వెళ్తున్నారు. ఈనెల 9లోపు చంద్రబాబు బయటకు వస్తారని యోచిస్తున్నాం. బాబుతో నేను, రిలే నిరాహారదీక్షలు ఈనెల 9 వరకూ కొనసాగుతాయి. 9వ తేదీలోపు చంద్రబాబు బయటకు రాకపోతే, ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త కార్యక్రమం చేపడతాం' అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

Hearing in High Court on Fiber Grid Case:ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై నిన్న (మంగళవారం) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో విచారణ జరిగిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలూ వినిపిస్తూ..ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో నారా లోకేశ్‌ ఇప్పటి వరకు నిందితుడిగా లేరని తెలిపారు. ఈ క్రమంలో న్యాయస్థానంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ చేసిన వాదనాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీడియాతో చిట్‌చాట్‌తో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

Lokesh Lunch Motion Petition in AP High Court: లోకేశ్​ ఫైబర్ గ్రిడ్ కేసు.. ముందస్తు బెయిల్​కు.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..

Achchennaidu Fire on YSRCP Leaders:కోర్టు పరిణామాలు చూసి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను ఈ నెల 10న నిర్ణయిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. నారా లోకేశ్ కూడా ఈ వారంలో చంద్రబాబుతో ములాఖత్ అవుతారని ఆయన పేర్కొన్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో కుంభకోణం అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైఎస్సార్సీపీ నేతలందరికీ.. నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ తరపు వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇన్నాళ్లు లోకేశ్‌పై నోరు పారేసుకున్న మంత్రులు.. ఇపుడేం సమాధానం చెప్తారని ఆయన నిలదీశారు. నారా లోకేశ్ తప్పులేదని న్యాయస్థానం చెప్పకముందే ప్రభుత్వమేలోకేశ్‌కి క్లీన్‌చిట్ ఇచ్చిన పరిణామాలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు... లోకేశ్ సీఐడీ విచారణ 10న

''చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలిసి జరిగిందా..? తెలియక జరిగిందా..? అనేది దేవుడికే తెలియాలి. అరెస్టు అక్రమమని తెలిసి కూడా బీజేపీ జాతీయ నేతలు కనీసం స్పందించకపోవటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే మేము పొత్తులో ఉన్నాం. వామపక్ష పార్టీల పొత్తు అంశం అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారు. చంద్రబాబు అరెస్ట్‌తో పార్టీ కార్యక్రమాలు ఏవీ స్తంభించలేదు. ఓట్ల అక్రమాలపై అప్రమత్తంగా ఉన్నాం. జైల్లో సౌకర్యాల కొరతపై చంద్రబాబుకు బాధ లేదు. కానీ, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి చేయని మరకను అంటించే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఎటువంటి స్పందన లేదని వైసీపీ ప్రభుత్వం చూపించే ప్రయత్నం చేసింది. కానీ, ఘోరంగా విఫలమైంది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో జగన్‌కి తెలిసొచ్చేలా.. రాష్ట్ర, దేశ, విదేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.'' -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

Supreme Court On TDP leaders Bail : సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారుకు చుక్కెదురు.. టీడీపీ నేతల బెయిల్​ రద్దు పిటిషన్ తిరస్కరణ

ABOUT THE AUTHOR

...view details