ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగం.. జగన్ దోపిడీ వల్లే విద్యుత్ చార్జీల పెంపు" - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి టీడీపీ లేఖ

Achchennaidu letter to CS: వాలంటీర్లకు ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచి పెడుతున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులనే వాలంటీర్లుగా నియమించారని.. ఇదే విషయాన్ని మంత్రులతో సహా బహిరంగంగా చెప్పారన్నారని లేఖలో పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడు
Achchennaidu letter to CS

By

Published : Apr 9, 2023, 9:43 PM IST

Updated : Apr 10, 2023, 6:23 AM IST

Achchennaidu letter to CS: వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ధనం జీతాలుగా ఇచ్చి పార్టీ సేవ చేయించుకోవటం దేశంలో ఇధే ప్రధమని ఆక్షేపించారు. వాలంటీర్లకు ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ అభ్యర్దుల తరపున ప్రచారం నిర్వహించారని లేఖలోపేర్కొన్నారు. మంత్రుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రభుత్వ వ్యవస్ధ దుర్వినియోగంపై నోరుమెదపకుండా నిస్తేజంగా ఉన్నారని తెలిపారు. ఒక్క జిల్లా కలెక్టర్ కూడా వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై మాట్లాడకపోవటం ఆశ్చర్యం కల్గిస్తోందని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలికి చెందిన వైసీపీ నేత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులను గెలిపించకపోతే ఉద్యోగాలు తీసేస్తామని వాలంటీర్లను బెదిరించారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇలానే వాలంటీర్లను, అధికారులను బెదిరిస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. వైసీపీ కుటుంబ సభ్యులే వాలంటీర్లుగా నియమించబడ్డారని మంత్రులతో సహా బహిరంగంగా చెప్పారని పేర్కొన్నారు.

వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేయొద్దని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించినా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలాది దొంగ ఓట్లను నమోదు చేయించేందుకే వాలంటీర్లను ఉపయోగించారన్నారు. ఇప్పుడు వైసీపీ పోస్టర్లు, కరపత్రాలు అంటించడానికి ఇంటింటికి పంచడానికి గృహసారథులతో కలిసి పని చేయాలని ఆదేశించారని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య బద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని, వాలంటీర్లు తమ జాబ్ చార్ట్ ప్రకారం వారు విధులు నిర్వహిస్తే వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన సక్రమంగా నడిచేందుకు వాలంటీర్లను కట్టడి చేయాలని అచ్చెన్న కోరారు. నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించి వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగం కాకుండా చూడాలని లేఖలో సూచించారు. వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తూ వైసీపీ కార్యకలాపాలకు అనుమతిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు వారి జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యుత్ చార్జీలపై కళా వెంకట్రావు జగన్ దోపిడీ వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.17వేల93 కోట్లు ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. మరో రూ.37వేల500 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మొత్తం 57వేల188 కోట్లు భారాలు విద్యుత్ వినియోగదారులపై మోపారని మండిపడ్డారు. 57 వేల కోట్ల భారాలు మోపినా కూడా విద్యుత్ సేవలు పెరగకపోగా విద్యుత్ కోతలు పెరిగాయని కళా ఆరోపించారు. ఈ రూ. 57 వేల కోట్లు ఎటుపోయాయి ఎవరు లూటీ చేశారని నిలదీశారు. జెన్కో, సీజీయస్ లో యూనిట్ 5 రూపాయలకే వస్తున్న విద్యుత్ ఉత్పత్తి చేయకుండా యూనిట్ 9 రూపాయలు పెట్టిబహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని అని కళా ప్రశ్నించారు. బహిరంగ కొనుగోళ్లకు రూ.12వేల200 కోట్లు ఖర్చు చేసి అందులో 6 వేల కోట్లు కమిషన్ దండుకున్నారని ఆరోపించారు. హిందూజా, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలతో జగన్ కి ఉన్న సంబందం ఏంటని కళా నిలదీశారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నందుకు జగన్ రెడ్డిని నమ్మాలా అని ఆక్షేపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 10, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details