ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు - TRS Mlas Buying Issue update

TRS Mlas Buying Issue update: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.

TRS Mlas Buying Issue update
TRS Mlas Buying Issue update

By

Published : Nov 1, 2022, 2:11 PM IST

TRS Mlas Buying Issue update: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిందితులు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్‌శర్మ, నందకుమార్‌, సింహయాజి సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. అరెస్ట్‌ చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లారు. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా.. శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో దీన్ని చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

గత నెల 26న తెరాసకు చెందిన ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను ప్రలోభాలకు గురిచేసిన విషయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి ప్రలోభ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుల రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం నిందితుల అరెస్ట్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై నిందితులు ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details