ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.12 కోట్ల కారు కొనుగోలు చేసిన హైదరాబాద్‌ యువకుడు

నేటి యువత మార్కెట్​లో వచ్చే సూపర్ బైక్​లు, కార్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ వద్ద బ్రాండెండ్ కార్లు, బైకులు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కోవకే చెందుతాడు తెలంగాణలోని హైదరాబాద్​కు చెందిన నసీర్‌ఖాన్‌ అనే యువకుడు. సూపర్​ కార్లంటే ఎంతో ఇష్టపడే ఇతగాడు.. ఏకంగా రూ.12 కోట్ల కారును కొనుగోలు చేశాడు.

రూ.12 కోట్ల కారు కొనుగోలు చేసిన హైదరాబాద్‌ యువకుడు
రూ.12 కోట్ల కారు కొనుగోలు చేసిన హైదరాబాద్‌ యువకుడు

By

Published : Dec 15, 2022, 9:35 AM IST

సూపర్‌ కార్లు అంటే ఎంతో ఇష్టపడే హైదరాబాద్​కు చెందిన నసీర్‌ఖాన్‌ అనే యువకుడు తాజాగా రూ.12 కోట్ల విలువైన అంతర్జాతీయ బ్రాండ్‌ ‘మెక్‌లారెన్‌ 765 ఎల్‌టీ’ కారు కొన్నారు. మెక్‌లారెన్‌ కంపెనీ కొద్ది నెలల క్రితం భారత్‌లో(ముంబయి) తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. ‘765 ఎల్‌టీ’ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు రోజుల క్రితం కొత్తకారు ముంబయి నుంచి హైదరాబాద్​లోని నసీర్​ఖాన్​ ఇంటికి వచ్చింది.

ఆ కారుతో తాను తీసుకున్న ఫొటోలు, వీడియోలను నసీర్‌ఖాన్​ తన ట్విటర్‌లో ఉంచారు. మెక్‌లారెన్‌ కంపెనీ దేశంలో విక్రయించిన రెండు కార్లలో ఒకటి కోల్‌కతాలో ఓ వ్యాపారి కొనుగోలు చేయగా.. రెండో కారును నసీర్‌ఖాన్‌ సొంతం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details