Shop Owner Beats a Boy for Stealing Cool Drink: హైదరాబాద్ నాంపల్లిలోని కిరాణా షాప్‌లో కూల్‌డ్రింక్ బాటిల్ దొంగతనం చేశాడని 9 ఏళ్ల బాలుడిని చితక్కొట్టాడు ఆ షాప్ యజమాని కృష్ణ. ముందు తన నివాసానికి తీసుకుని వెళ్లి, బట్టలూడదీసి కాళ్లు చేతులు కట్టేసి కొట్టుకుంటూ వీడియోలను చిత్రీకరించాడు. కారం చల్లి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తెలిసిన వారికి పంపడంతో ఒకరి దగ్గరి నుంచి మరొకరి దగ్గరి ఇలా చివరికి బాలుడి తల్లిదండ్రులకు చేరాయి. దీంతో వారు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కూల్‌డ్రింక్ చోరీ చేశాడని.. కారం చల్లి చిత్రహింసలు పెట్టిన షాప్ ఓనర్ - బాలుడు కూల్‌డ్రింక్ చోరీ వార్త
Stealing Cool Drink: హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ దొంగతనం చేశాడనే కారణంతో.. దుకాణ యాజమాని తొమ్మిదేళ్ల బాలుడి బట్టలూడదీసి కాళ్లు చేతులు కట్టేసి కొట్టాడు. కారం చల్లుతూ చిత్రహింసలకు గురి చేశాడు.

కూల్‌డ్రింక్ చోరీ
TAGGED:
నాంపల్లిలో కూల్‌డ్రింక్ చోరీ