ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారేసుకున్న పర్సు.. యువతి ప్రాణాలను కాపాడింది.. ఎలాగంటే..? - విజయవాడ వార్తలు

Purse Saved Woman Life: ఓ యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సు ఎక్కింది. అనంతరం ఓ స్టాప్​ దగ్గర దిగి వెళ్లిపోయింది. కానీ తనతో తెచ్చుకున్న పర్సు మాత్రం ఆ బస్సులోనే పడిపోయింది. ఇప్పుడు ఆ పర్సు.. ఆ యువతి ప్రాణాలను రక్షించింది. ఎలాగంటారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

woman
యువతి

By

Published : Dec 26, 2022, 10:56 AM IST

Purse Saved Woman Life: ఆదివారం మధ్యాహ్నం.. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతం.. ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులందరూ దిగిపోయాక.. బస్సులో ఓ పర్సు పడి ఉండడాన్ని కండక్టర్‌ రవీందర్‌ గమనించారు. అది ఎవరిదో తెలుసుకోవడానికి పర్సును తెరిచి చూస్తే.. అందులో 403 రూపాయల నగదుతో పాటు ఓ లేఖ దొరికింది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని ఆ లేఖలో రాసి ఉండడం చూసి ఆయన కంగుతిన్నారు.

పర్సులో యువతి ఆధార్‌ కార్డు ఉండడంతో వెంటనే ఆయన ట్విటర్‌ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్‌ లేఖ, ఆధార్‌ కార్డు ఫొటోలను షేర్‌ చేశారు. ఎండీ తక్షణం స్పందించి.. ఆ యువతిని గుర్తించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ ఎస్సై దయానంద్‌, మారేడ్‌పల్లి పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఆమెను గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన సిబ్బందితో పాటు కండక్టర్‌ రవీందర్‌ను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details