Atrocities of ruling party leaders: ఇది ఓ న్యాయమూర్తి తల్లి వేదన. కుమారుడి మృతితో నిరాశ్రయురాలిగా మారానని వాపోతున్నారు. గతంలోనే తన కుమారుడి నుంచి విడాకులు పొందిన కోడలు.. ఆస్తి కోసం బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. దీని వెనుక ఓ మంత్రి హస్తం ఉండటంతో.. తనకు న్యాయం జరగడం లేదని కన్నీరుమున్నీరు అవుతున్నారు. రొయ్యూరు గ్రామానికి చెందిన పటమట తిరుమలరావు.. సీనియర్ సివిల్ జడ్జిగా చేసేవారు. ఏడాది కిందట కొవిడ్‌తో మృతి చెందారు. పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ఆయనకు 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండేది. అందులో కొంత విక్రయించగా... 5 ఎకరాలకు పైగానే మిగిలింది.
అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి కాపాడమని ఓ తల్లి వేడుకోలు - మచిలీపట్నం కోర్టు వార్తలు
Atrocities of ruling party leaders: వ్యవసాయ భూమి వివాదంలో ఉంది. న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఇంతలోనే ఓ మంత్రి మద్దతుతో... అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. కౌలు రైతులు సాగు చేసిన ధాన్యాన్ని దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు మంత్రి అనుచరుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. భూబకాసురుల నుంచి తమ పొలాన్ని రక్షించమంటూ... కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందిన దివంగత సివిల్ జడ్జి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తిరుమలరావు మృతి చెందిన తర్వాత 1.30 సెంట్ల స్థలాన్ని ఆయన భార్య విక్రయించారు. దీనిపై ఆమె కోర్టులో సవాల్ చేశారు. ఇంతలోనే ఓ మంత్రి మద్దతుతో... అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైసీపీ నేత సాంబశివరావు, అర్జునరావు, నాగేశ్వరరావు, పడమట ఉషారాణి, అనుతేజ్ కలిసి.. కౌలు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు వెంకటసుబ్బమ్మ సంబంధీకులు ఆరోపిస్తున్నారు. గతంలోనే కౌలు రైతులు మచిలీపట్నం కోర్టులో పిటిషన్ వేశారని.. ఇది విచారణలో ఉండగానే ఈనెల 20న దౌర్జన్యంగా లక్షా 50వేల విలువైన ధాన్యాన్ని తీసుకెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: