Conflict between the couple: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలో ఓ వివాహిత కవిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సయమంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కవిత ఆత్మహత్యకు దంపతుల మధ్య జరిగిన వివాదమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. కవిత-సంగమేశ్వరరావు దంపతులు సత్యానారాయణపురంలో నివాసముంటున్నారు. కవిత గ్రామ సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు.
దంపతుల మధ్య వివాదం.. ఉరి వేసుకొని భార్య ఆత్మహత్య! - ఎన్టీఆర్ జిల్లా నేర వార్తలు
Woman Suicide at Vijayawada: దంపతుల మధ్య వివాదం.. వివాహిత ఆత్మహత్యకు దారితీసింది. భర్తతో గొడవ కారణంగా.. విజయవాడ సత్యనారాయణపురంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసు కవిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
దంపతుల మధ్య వివాదం
అయితే భర్త సంగమేశ్వరరావు.. మరో మహిళతో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై దంపతులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆర్ధరాత్రి సమయంలో భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా.. సదరు మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: