TS: హైదరాబాద్లో మరో దారుణం.. బాలికపై ఐదుగురు అత్యాచారం - 10th class student raped in ap
10:21 November 29
పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియోలు పెడతామని బాలికను బెదిరించారు. పది రోజుల తర్వాత మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా అత్యాచార వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: