Car into Well: తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ వచ్చి.. తిరిగి వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు. కేసముద్రం బైపాస్ రోడ్డులో మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
తెలంగాణలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి - ఏపీ తాజా వార్తలు
Car into Well: తెలంగాణలోని మహబూబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ దర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే..?
car into well
ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కారులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన నలుగురు కారుతో సహా బావిలో పడిపోయారు. వారిలో ఇద్దరు మహిళలను వెలికి తీయగా ఒకరు మృతి చెందినట్లు గుర్తించారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు వ్యక్తులు కారులోనే చిక్కుకుని ప్రాణాలొదిలారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: