- రైతుల పాదయాత్ర సాఫీగా సాగేందుకు చేపట్టిన చర్యలేంటి..?: హైకోర్టు
High Court on Amaravati JAC petition: రాజధాని రైతుల మహా పాదయాత్రను వైకాపా అడ్డుకుంటోందన్న అమరావతి ఐకాస లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. పాదయాత్ర సాఫీగా జరిగేందుకు చేపట్టిన చర్యలపై ధర్మాసనం వివరణ అడిగింది. విచారణను ఉన్నత ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
- రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌కు ఎస్ఎల్పీ నెంబర్ కేటాయించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
AMARAVATI JAC ON SLP NUMBER : రాజధాని అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రావటాన్ని అమరావతి ఐకాస నేతలు స్వాగతించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ గౌరవించలేదని.. సుప్రీంకోర్టు ఇచ్చేది తుది తీర్పు కావటంతో దానినైనా అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం రాజధాని రైతులంతా ఎంతో ఆశాభావంతో ఉన్నారని వెల్లడించారు.
- భూ కుంభకోణాలపై ప్రభుత్వ మౌనం ఎందుకు?: లోకేశ్
LOKESH ON YSRCP : విశాఖలో రోజుకో కుంభకోణం బయటపడుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. తాడేపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంజీవని వైద్య కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. మంగళగిరిలో అక్రమాలకు హద్దే లేకుండా పోతుందన్న లోకేశ్... అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- అలుపెరగని పోరాటం.. జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన ద్వారపూడి
Farmers Padayatra : వైకాపా ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా.. వాటన్నింటిని దాటుకుని వాళ్ల లక్ష్యం వైపు సాగుతున్నారు అమరావతి రైతులు. అలుపెరగని పోరాటం చేస్తూ.. జై అమరావతి అంటూ నినాదాలతో కదం తొక్కుతున్నారు. పాలకులు దాడులతో గాయాలు చేస్తే.. ప్రజలు మంచి మనసుతో క్షీరాభిషేకం చేస్తున్నారు. ఒకటే సంకల్పం.. ఒకటే రాజధానితో ముందుకు సాగుతున్న రైతులకు.. అన్ని వర్గాల ప్రజలు ఘనస్వాగతాలు పలుకుతున్నారు.
- బెంగళూరు అతలాకుతలం.. చెరువులుగా మారిన రహదారులు.. అనేక ఇళ్లు ధ్వంసం
Bangalore Rain : కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి భారీ వాన ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వానతో నగరం నీట మునిగింది. బెంగళూరులోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.
- 'కుట్రపూరితంగానే గంగూలీని తప్పించారు'.. దాదాకు మద్దతుగా దీదీ
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆరోపించారు.
- బ్రిటన్ ప్రధాని రాజీనామా- పదవి చేపట్టిన 45 రోజులకే..
Liz Truss Resign : బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆమె ఇటీవల తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు.
- గూగుల్‌కు భారీ షాక్.. రూ.1337.76 కోట్ల జరిమానా విధించిన సీసీఐ!
CCI Fines Google : ప్రముఖ సెర్చింజిన్ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్ తగిలింది. కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఎంతంటే?
- పాక్ పర్యటనకు టీమ్ఇండియా.. కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఏం అన్నారంటే?
టీమ్ఇండియా.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే విషయమై బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడారు. ఏం అన్నారంటే..
- వైరల్‌గా రేణూ దేశాయ్ పోస్ట్.. పవన్‌ను ఉద్దేశించి పెట్టిందేనా?
నటి రేణూ దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది పవన్‌ను ఉద్దేశించి పెట్టిందేనంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ అదేంటంటే..
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM