- వివాహిత హత్య.. భర్తే హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపణ
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరులో వివాహిత హత్య సంచలనం రేపింది. దుండగులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గొంతుకోసి చంపి.. నగలు ఎత్తుకెళ్లారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గంగవరం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బండికి తాళం వేసి కీ మరిచాడు.. లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి..!
సాధారణంగా ఈ రోజుల్లో బయటికి వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది ద్విచక్రవాహనం. ఎక్కడికి వెళ్లాలన్నా బండి మీద వెళ్తారు. అయితే ఎక్కడికి వెళ్లినా బండికి తాళం వేసి లోపలికి వెళ్తాము. కొన్నిసందర్భాలలో తాళం బండికే ఉంచుతాము. అయితే ద్విచక్ర వాహనం నిలిపి.. బండికే తాళం ఉంచితే.. ఏమవుతుందో ఇక్కడ జరిగిన ఘటన రుజువు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుపథం టికెట్లను సేవా టికెట్లుగా మార్చి విక్రయం.. వ్యక్తి అరెస్ట్
తిరుమల సుపథం టికెట్లను సేవా టికెట్లుగా మార్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ భూదందాలపై సిట్ నివేదికలు బయటపెట్టాలి: జీవీఎల్
విశాఖలో భూఅక్రమాలపై సిట్ నివేదికలను బయటపెట్టాలని భాజపా ఎంపీ జీవీఎల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ భూభాగోతాలపై తాను రాసిన లేఖ వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆయన అన్నారు. విశాఖ భూదందాల్లో వైకాపా, తెదేపా నేతల పాత్ర ఉందన్న జీవీఎల్.. తగిన చర్యలు తీసుకునే వరకూ భాజపా పోరాడుతుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతిలో ఘోర ప్రమాదం.. భవనం కూలి ఐదుగురు మృతి
మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్ చౌక్‌లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అధ్యక్ష తరహా పాలన వైపు దేశం.. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి'
అధికార భాజపాను ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. చట్టాల పేరిట అధికారాలను తీసుకుంటూ.. దేశాన్ని అధ్యక్ష తరహా పాలన వైపు తీసుకెళ్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 100 బోగీలతో ప్రపంచంలోనే అతిపొడవైన రైలు చూశారా
ప్రపంచంలోనే అతిపొడవైన రైలు స్విట్జర్లాండ్‌లో పట్టాలెక్కింది. ఆల్ఫ్ పర్వత సానువుల గుండా ప్రయాణించి అందులోని ప్రయాణికులకు మధురానుభూతులను పంచింది. ప్రకృతి రమణీయతకు మణిహారంగా మారిన ఆ రైలు బోగీలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రైల్వే సేవలను ప్రవేశపెట్టి 175 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ అతి పొడవైన రైలును నడిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రెడిట్ స్కోరు తగ్గిందా.. ఈ జాగ్రత్తలతో పెంచుకోవడం సులభమే!
ఆర్థికంగా మీరు క్రమశిక్షణగా ఉన్నారా? తీసుకున్న రుణాలకు వాయిదాలు సరిగ్గా చెల్లిస్తున్నారా? కొత్తగా అప్పు తీసుకునేందుకు మీకు అర్హత ఉందా? ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా? మీ క్రెడిట్ నివేదిక చూస్తే చాలు.. మీ ఆర్థిక అలవాట్లను అర్థం చేసుకునేందుకు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందంటే మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. మరి, ఈ స్కోరు తగ్గకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాకిస్థాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. పగిలిన నెదర్లాండ్స్ బ్యాటర్ ముఖం!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ రవూఫ్ వేసిన బంతికి నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డీ లిడె తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెట్టింట వైరల్‌గా మారిన బన్నీ ఫొటో.. 'పుష్ప-2' షూటింగ్ స్టార్ట్ అయిందా?
'పుష్ప-2' సినిమా షూటింగ్ ప్రారంభమైందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే బన్నీకి సంబంధించిన లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆదివారమే షూటింగ్ స్టార్ అయిందని తెలుస్తోంది. అసలేంటి ఆ ఫొటో? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5PM TOP NEWS