ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM - Telugu latest news

.

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS

By

Published : Nov 20, 2022, 2:59 PM IST

  • 45 రోజుల్లో 52 లక్షల కుటుంబాలతో భేటీ.. 'ఇదేం ఖర్మ - రాష్ట్రానికి'.. తెదేపా కార్యాచరణ
    వైకాపా నేతల దాడులు, అడ్డగింతలపై ఎదురుదాడినే లక్ష్యంగా చేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది. వైకాపా అరాచకాలకు ప్రతిఘటనే సరైన విధానమని... పార్టీ విస్తృస్థాయి భేటీలో నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్‌ ఒకటి నుంచి ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాలని.. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను నమోదు చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. మంచం విరిగి..
    మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.. అనారోగ్యంతో చికిత్సకు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగికి.. వింత పరిస్థితి ఎదురైంది. మంచంపై పడుకోబెట్టి చికిత్స చేస్తుండగా.. ఆ మంచం విరిపోయిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. ఆ రోగికి తీవ్రగాయాలవడంతో.. తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నిధుల మళ్లింపు "పంచాయితీ".. తిరుపతి నుంచి చలో దిల్లీకి కార్యచరణ.. !
    రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి.. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధుల్ని సాధించి తీరుతామని సర్పంచులు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి దిల్లీ దాకా ఆందోళనలు ఉధృతం చేయాలని విజయవాడలో జరిగిన 2రోజుల కార్యశాలలో నిర్ణయించారు. పంచాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన 6వేల కోట్ల రూపాయల విద్యుత్తు ఛార్జీల బకాయిల్ని రద్దు చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్‌ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
    వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మృతుల్లో దంపతులు, ఆటో డ్రైవరు ఉన్నారు. వీరంతా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పేరు తప్పుగా పడిందని వినూత్న నిరసన.. అధికారి ముందు కుక్కలా మొరుగుతూ..
    రేషన్ కార్డులో పేరు తప్పుపడిందని ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కారు ఎదుట కుక్కలా అరిచాడు. ఈ విచిత్ర సంఘటన బంగాల్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి
    ఝార్ఖండ్​లో బొగ్గు దొంగల ముఠాకు, సీఐఎస్ఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అసలేం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ''పచ్చ'గా పదికాలాలు ఉండాలంటే.. చెట్లు పెంచాల్సిందే!'
    పరిసరాల్లో చెట్ల సంఖ్య పెరిగితే అకాల మరణాలకు కళ్లెం వేయవచ్చని ఓ అధ్యయనం రుజువు చేసింది. నాటిన ప్రతి మొక్క ద్వారా ప్రాణాలు నిలుస్తున్నాయని అందులో వెల్లడైంది. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటిన చోట మరణాల రేటు, తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ట్విట్టర్​ పోల్​లో​ ఆయనదే పైచేయి.. ట్రంప్​ అకౌంట్​ను పునరుద్ధరించిన మస్క్​
    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే విషయమై మస్క్​ నిర్వహించిన పోల్​లో ట్రంప్​కు యూజర్లు మద్దతు పలికారు. దీంతో ఆయన అకౌంట్​ను పునరుద్ధరించింది ట్విట్టర్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • BCCI కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ ఎవరు?.. రేసులో ఇద్దరు మాజీలు!
    కొత్తగా ఏర్పడబోయే బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. చీఫ్‌ సెలెక్టర్‌ రేసులో ప్రముఖంగా ఇ‍ద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారు ఎవరంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బేబమ్మా నీ క్యూట్​ లుక్స్​కు ఎవరైనా ఫ్లాట్​ అవ్వకుండా ఉంటారా
    బేబమ్మ అంటూ ఉప్పెన సినిమాలో కెరటంలా వచ్చిన కృతి శెట్టి తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. హీరోయిన్‌గా వరుసగా విజయాలు అందుకుంటోంది. తాజాగా తన రొమాంటిక్​ చూపులతో కొత్త ఫొటోలు పోస్ట్​ చేసి సోషల్​మీడియాను హీటెక్కెస్తుంది. ఓ సారి ఆమె ఫొటోలపై లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details