- అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఆందోళన
అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రభుత్వ ఆటవిక పాలనకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అయన్నను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CID DIG: అయ్యన్నపాత్రుడి అరెస్టులో అన్ని నిబంధనలు పాటించాం: సీఐడీ డీఐజీ
అయ్యన్నపాత్రుడి అరెస్టు విషయంలో అన్ని నిబంధనలు పాటించామని సీఐడీ డీఐజీ స్పష్టం చేశారు. ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం అయ్యన్న, ఆయన కుమారుడిని విశాఖ కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్నేహం పేరుతో బాలికపై అత్యాచారం.. ఆపై సోషల్ మీడియాలో ఫొటోలు..
ఆమె మైనర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా నటించాడు. ఆ తర్వాత ఆమెను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇదే విషయమై ఆ బాలిక యువకుడిని నిలదీయగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. మోసపోయానని గ్రహించిన ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Nara Lokesh: జగన్‌రెడ్డి.. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు: నారా లోకేశ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సీఎం జగన్‌పై తెదేపా నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. బాబాయ్‌ని లేపేసి అవినాష్‌రెడ్డికి ఎంపీ సీటు ఇప్పించారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నవజాత శిశువు కడుపులో 8 పిండాలు.. షాక్‌లో కుటుంబ సభ్యులు
కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ నవ జాత శిశువును ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఆ పాపకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులో నుంచి ఎనిమిది పిండాలను వెలికితీశారు. దీంతో ఆ కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఫ్యామిలీపై డౌట్ వచ్చి చెకింగ్.. చీరలు, చెప్పుల్లో రూ.4కోట్లు
ముంబయి విమానాశ్రమంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల బ్యాగ్‌లో, చీరల్లో, చెప్పుల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 88వ పెళ్లికి రెడీ అయిన వృద్ధుడు.. ఈసారి పెళ్లికుమార్తె ఎవరంటే..
ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 87 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 88వ వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ పెళ్లిళ్ల పర్వం తన 14వ ఏట మొదలు పెట్టి 61 ఏళ్ల వయసులోనూ మరో పెళ్లికి సిద్ధమైన ఓ వృద్ధుడి వింత గాథ ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎయిరేషియా ఇండియా ఇక పూర్తిగా టాటా గ్రూప్‌దే
ఇప్పటికే ఎయిరేషియా ఇండియాలో టాటాకు 83.67% వాటాలున్నాయి. తాజా లావాదేవీతో మొత్తం 100 శాతం వాటా టాటాల పరమైంది. దీంతో భారత్ నుంచి ఎయిరేషియా పూర్తిగా వైదొలగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- T20 worldcup: కోహ్లీ 'ఫేక్ ఫీల్డింగ్'.. తెరపైకి బంగ్లా కొత్త వివాదం
టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్‌పై ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్.. ముగిసిపోయిన మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనే ప్రయత్నంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు కొత్త వివాదానికి తెరలేపింది. కోహ్లీపై విమర్శలు చేసింది. ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సస్పెన్స్ ప్లస్ రొమాన్స్.. ఆసక్తిగా అడివి శేష్ 'హిట్ 2' టీజర్
యంగ్ హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 సెకండ్ టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3PM TOP NEWS