ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

.

3PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Oct 20, 2022, 2:59 PM IST

  • అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణలకు గవర్నర్ ఆమోదం
    Governor: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఉద్దేశించిన చట్టసవరణలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్ట సవరణలకు గవర్నర్‌ ఆమోదించారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చంద్రబాబు, పవన్ కలవడాన్ని స్వాగతిస్తున్నాను: సోము వీర్రాజు
    Somuveerraju: రైతు సంబంధిత కేంద్ర పథకాలను జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేస్తున్నారని దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైకాపా ఎంపీ దాడి చేయించటాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబు పవన్‌ కలవటాన్ని ఆయన స్వాగతిస్తున్నానన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వాహనాన్ని ఓవర్ టేక్ చేసూ.. డివైడర్​ని ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి
    road accident in CCTV footage:: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు.. బొలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ, డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సీఎం సభకు వచ్చిన ముగ్గురు మహిళలకు అస్వస్థత
    సీఎం సభకు వచ్చిన ముగ్గురు మహిళలకు అస్వస్థత..ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు మహిళలు. అంబులెన్స్‌లో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలింపు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు
    దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టి 75వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. వారికి ప్రధాని స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదేళ్లలో సీఎం సంపద డబుల్.. కొత్తగా రూ.కోట్ల ఆస్తి.. బంగారం ఎంత ఉందంటే?
    హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు తన నియోజకవర్గంలో నామినేషన్ వేసిన ఆయన.. తనకు మొత్తం రూ.6.28 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పద్మభూషణ్ అందుకున్న సత్య నాదెళ్ల.. త్వరలో భారత పర్యటన
    భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ అవార్డును మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అమెరికాలో స్వీకరించారు. ఈ గుర్తింపు లభించడం గౌరవంగా ఉందని అన్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సత్య నాదెళ్ల.. భారత్​లో పర్యటిస్తారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'టాప్ ఉద్యోగిపై 10 నిమిషాల్లో వేటు.. హోదా ఏదైనా ఉద్వాసన తప్పదు'
    కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఎంతటి వారి పైనైనా సరే చర్యలు తీసుకుంటామని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ హెచ్చరించారు. ఇటీవల ఓ కీలక వ్యక్తిని కేవలం 10 నిమిషాల్లో తొలగించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • T20 World Cup: టీమ్‌ఇండియాలో 'ఆ నలుగురు'.. ఎలా రాణిస్తారో?
    ఎంతటి పెద్ద ఆటగాడైనా ఫామ్‌లో ఉంటేనే ఆడగలడు. అలాగే టీమ్‌ అయినా సరే రాణించాలంటే ఏ ఒక్కరి మీదనో ఆధారపడి ఉండకూడదు. కానీ సీనియర్లు మాత్రం తమ బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అయితే మరి టీమ్‌ఇండియాకు అలాంటి ఆటగాళ్లు ఎవరున్నారు..? గత కొన్ని టీ20ల్లో ఎలా రాణించారు..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'బింబిసార' దర్శకుడికి రజనీకాంత్‌ ఛాన్స్ ఇచ్చారా?
    'బింబిసార' దర్శకుడు వశిష్ఠ​.. తన తదుపరి సినిమా సూపర్​స్టార్​ రజనీకాంత్​తో చేయనున్నారని దక్షిణాది వర్గాల్లో టాక్​ వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details