ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Electric Shock: అనంతలో తెగిపడ్డ విద్యుత్​ వైరు.. ఎన్టీఆర్​ జిల్లాలో కరెంట్​​ షాక్​తో బాలుడు మృతి - ap electric shock news today live

Boy Died With Electric Shock: విద్యుత్​ ప్రమాదానికి గురై ఎన్టీఆర్​ జిల్లాలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా.. విద్యుత్​ వైర్లు తెగి 3 శునకాలు మృత్యువాతపడ్డాయి. ఇలా తరచూ విద్యుత్​ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Electric Shock
విద్యుత్​ షాక్​తో బాలుడి మృతి

By

Published : Jun 18, 2023, 2:19 PM IST

12 Years Old Boy Died With Electrocuted: విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్​ ప్రమాదంతో రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట నిండు ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని అనార్థాలు సంభవించినా విద్యుత్​ అధికారులు మాత్రం.. ప్రమాదాలను కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్​ జిల్లాలో విద్యుదాఘాతానికి గురై 12ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం జిల్లాలో విద్యుత్​ వైర్లు తెగిపడి 3శునకాలు ప్రాణాలు వదిలాయి.

ఎన్టీఆర్​ జిల్లాలో బాలుని మృతి:ఎన్టీఆర్​ జిల్లా నందిగామ మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన భూక్యా ఆనందనాయక్​ అనే 12 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్​ తీగలకు చుట్టుకున్న గాలిపటాన్ని తీసుకునే క్రమంలో విద్యుత్​ షాక్​కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో బాలుడు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి

వైర్లు తెగి శునకాలు మృతి :అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలోని పంట పొలాల్లో.. విద్యుత్​ వైర్ తెగి కిందపడిపోయింది. తెగి కిందపడిన విద్యుత్​ వైర్​ వద్దకు వెళ్లిన మూడు కుక్కలకు విద్యుత్​ షాక్​ తగిలి.. అవి ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డాయి. కరెంట్​ తీగ తెగి పడిన సమయంలో ప్రమాద స్థలంలో ఎవరు లేకపోవటంతో.. పెను ప్రమాదం తప్పింది. పొలం పనుల కోసం వెళ్లిన రైతులు తెగిపడిన విద్యుత్​ వైర్​ను, దాని వద్ద మృతి చెందిన కుక్కలను చూసి ఆందోళనకు గురయ్యారు.

విద్యుత్​ అధికారులు పాత విద్యుత్​ తీగల స్థానంలో కొత్త వాటిని అమర్చకపోవటంతో.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నవంబర్​లో దర్గా హోన్నూరు గ్రామంలో విద్యుత్​ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మరణించిన విషయం మరవక ముందే ఇప్పుడు శునకాలు మృత్యువాత పడటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్​ లైన్లు కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవని.. విద్యుత్​ తీగలు పలుచోట్ల మరమ్మతులకు గురై తెగి కింద పడుతున్నట్లు రైతులు, గ్రామ ప్రజలు తెలిపారు. పాత విద్యుత్ తీగలు మార్చాలని పలుమార్లు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. విద్యుత్​ తీగలు పాతగా మారిన వాటి స్థానంలో నూతనంగా విద్యుత్​ తీగలను ఏర్పాటు చేయాలని.. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details