Fire Crackers Accident: మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళికి బాణసంచా కాలుస్తుండగా లక్ష్మి నరసింహారావు అనే 11 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. పెద్దల పర్యవేక్షణ లేకుండా బాలుడు ఒక్కడే బాణసంచా కాలుస్తుండగా.. బాణసంచా పేలి బాలుడికి మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయాల పాలైన బాలుడ్ని మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు తరలిస్తుండగా మృతి చెందాడు.
పండుగ వేళ అపశృతులు.. దీపావళి వేడుకల్లో ఒకరు మృతి, పలువురికి గాయాలు
Firecrackers Explosion: రాష్ట్రంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే, పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి ఓ బాలుడు మృతి చెందగా, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురికి గాయాలైయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్తలో బాణాసంచా పేలి నలుగురికి యువకులకు గాయాలయ్యాయి. పులుగుర్త గ్రామానికి చెందిన నలుగురు యువకులు.. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద బాధితులను మంత్రి వేణు పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యలకు సూచించారు.
ఇవీ చదవండి: