chlorine pipe leak in a swimming pool: విజయవాడ గాంధీనగర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ పైప్ లీకేజ్ కలకలం రేపింది. పైపు లీకేజీ కావటంతో సుమారు 10 మంది క్రీడాకారులు అస్వస్థతకు గురయ్యారు . వీరిలో కొందరు చిన్నారులు ఉన్నారు. వారందరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెయిన్ బో, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈనెల 10,11 తేదీల్లో సౌత్ ఇండియా స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయి. దీంతో క్రీడాకారులు సాధన చేస్తున్న సమయంలో హటాత్తుగా క్లోరిన్ పైప్ లీకైందని అధికారులు చెబుతున్నారు. సకాలంలో స్పందించిన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు క్రీడాకారులను పూల్ నుంచి బయటకు తీయటంతో ప్రాణాపాయం తప్పిందని స్విమ్మర్స్ తల్లిదండ్రులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన స్విమ్మర్స్ ఇప్పటికే రాష్ట్ర ,జాతీయ స్థాయిల్లో పలు పోటీల్లో పాల్గొన్నారని చెబుతున్నారు.
స్విమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ పైప్ లీకేజ్ కలకలం.. 10 మంది క్రీడాకారులు అస్వస్థత - 10 మంది క్రీడాకారులు అస్వస్థత
10 swimmers sick due to chlorine pipe leak: విజయవాడ గాంధీనగర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ పైప్ లీకేజ్ కలకలం సృష్టించింది . పైపు లీకేజ్‌తో సుమారు 10 మంది క్రీడాకారులు అస్వస్థతకు గురయ్యారు . వీరిని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం క్రీడాకారుల అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు .
ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ ఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్ ఇటీవల ఆధునీకరించారు. ఒలింపిక్ స్థాయి పూల్‌ను ఏర్పాటు చేశారు . మరోవైపు ఐదేళ్ల కిందట ఇటువంటి ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. క్లోరిన్ పైప్ లీకేజీ జరిగినపుడు క్రీడాకారులంతా పూల్ లోనే ఉన్నారని.. పూల్ నిర్వాహకులు అప్రమత్తం చేసి వారిని పూల్ నుంచి బయటకు తీశారని స్విమ్మర్స్ తల్లిదండ్రులు చెబుతున్నారు . శ్వాస తీసుకోవటంతో పలు ఇబ్బందులకు గురయ్యారని.. పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయ్యారని భయమేసిందని తల్లిదండ్రులు వెల్లడించారు. నగరంలో మొత్తం మూడు స్విమ్మింగ్ పూల్స్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు . ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పట్టిష్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి చదవండి: