ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Buggana: ఉపాధి హామీ డబ్బుల కోసం మంత్రి బుగ్గనకు మహిళల మొర - నంద్యాలలో మంత్రి బుగ్గన పర్యటన

Minister Buggana: నంద్యాల జిల్లాలో ఆర్థికమంత్రి బుగ్గనకు సమస్యలు స్వాగతం పలికాయి. గడప గడప కార్యక్రమానికి వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకుని.. తమ మొర చెప్పుకున్నారు. రెండు నెలలుగా ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని.. ఇళ్లు మంజూరు చేయడంలేదని మంత్రి ముందు మహిళలు వాపోయారు. వారంలోగా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చి.. అక్కడినుంచి వెళ్లిపోయారు.

Minister Buggana
నంద్యాలలో మంత్రి బుగ్గన పర్యటన

By

Published : May 11, 2022, 1:11 PM IST

Updated : May 11, 2022, 1:25 PM IST

ఉపాధి హామీ డబ్బుల కోసం మంత్రి బుగ్గనకు మహిళల మొర

Minister Buggana: గడప గడపకూ ప్రభుత్వం పేరిట జనంలోకి వెళుతున్న మంత్రులకు.. సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉగాది నుంచి ఉపాధి హామీ డబ్బులు రావట్లేదని నంద్యాల జిల్లాలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి మహిళలు మొర పెట్టుకున్నారు. బేతంచర్ల మండలం హెచ్‌.కొట్టాలలో మంత్రి బుగ్గన పర్యటించిన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ డబ్బులపై అధికారిని ప్రశ్నించిన మంత్రి బుగ్గన... వారంలో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు.

Last Updated : May 11, 2022, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details