ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండని చెరువులు.. మునగని బొజ్జ గణపయ్యలు

No sufficient water: గణనాథులు మూడు రోజులు ఘనంగా పూజలందుకుని గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఎంతో భక్తితో భారీ ఎత్తున ఊరేగింపుతో వినాయక విగ్రహాలను చెరువు వద్దకు తీసుకువచ్చిన భక్తులు షాక్​కు గురవుతున్నారు. విగ్రహాలన్నీ మునిగేందుకు సరిపడా నీళ్లు లేక బయటకు తేలుతున్నాయి. దీంతో భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు.

By

Published : Sep 3, 2022, 8:14 PM IST

water problem
ganesh immersion

Water Problem for Ganesh Immersion: వినాయక విగ్రహాలకు భక్తులు మూడు రోజులపాటు ఘనంగా పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు. కానీ చెరువులో విగ్రహాలు మునిగేందుకు సరిపడా నీళ్లు లేక విగ్రహాలన్నీ పైకి తేలుతున్న ఘటన నంద్యాల జిల్లాలోని డోన్​లో జరిగింది. శుక్రవారం అబ్బిరెడ్డిపల్లి చెరువులో మునిసిపల్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో రెండు క్రేన్ల సహాయంతో వినాయక నిమజ్జనం నిర్వహించారు. అయితే విగ్రహాలన్నీ నీళ్లలో మునగక బయటకు కనిపిస్తున్నాయి. విగ్రహాలను ఇంకా కొంచెం లోపలికి వేసుంటే బాగుండేదని పలువురు ఆభిప్రాయపడుతున్నారు. రైతులు, ప్రజలకే కాదు దేవునికీ నీళ్ల కష్టాలు తప్పడం లేదంటున్నారు.

హంద్రీనీవా నీళ్లు విడుదల చేసుంటే చెరువు నిండేదని.. గణేశ్​ విగ్రహాలు పూర్తిగా మునిగి ఉండేవని ప్రజలంటున్నారు. గణనాయకులను నీటిలో పూర్తిగా మునిగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

నిండని చెరువులు.. మునగని బొజ్జ గణపయ్యలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details