Rain effect in Nandyal: నంద్యాలలో కురిసిన భారీ వర్గానికి టీటీడీ కల్యాణ మండపం చుట్టూ నీరు చేరింది. కల్యాణ మండపంలో వివాహం జరుగుతుండగా.. వచ్చినవారికి ఇబ్బందులు తప్పలేదు. భారీగా నీళ్లు ఉండటం వల్ల రహదారి నుంచి మండపంలోకి వెళ్లేందుకు సాధ్యం కాలేదు.. దీంతో అందరూ ఇబ్బంది పడ్డారు. నీళ్లలో ఎలా వెళ్లాలా అని ఆలోచించారు. ఇంతలో వాళ్లకో ఐడియా వచ్చింది.. పెళ్లికి వచ్చే వారిని మండపం వరకు ట్రాక్టర్లో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఈ కల్యాణ మండపం అవరణమంతా లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల ఈ సమస్య వచ్చిందని.. నీళ్లు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పెళ్లికి వచ్చినవాళ్లంటున్నారు.
చెరువులా పెళ్లి మండపం.. లోపలికి ఎలా వెళ్లారంటే..! - ap news
Heavy water in TTD Kalayana Mandapam: అందరూ పెళ్లికి వచ్చారు... నూతన జంటను ఆశీర్వదించాలని ఆశ పడ్డారు.. కానీ తీరా అక్కడి పరిస్థితి చూశాక అంతా షాక్ అయ్యారు. భారీ వర్షంతో పెళ్లి మండపం అంతా చెరువులా మారింది. పెళ్లి మండపంలోనికి వెళ్లేందుకు దారి లేక అవస్థలు పడ్డారు. దీంతో ఓ ట్రాక్టర్ ఏర్పాటు చేసి వచ్చిన వారందరినీ లోపలికి తీసుకెళ్లారు.
1