Pawan Tour: ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. వారికి భరోసా ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఈ ఉదయం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి బయల్దేరి నంద్యాల జిల్లా శిరివెళ్ల గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి వెళ్తారు. మార్గమధ్యలో.. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులకు చెందిన నాలుగు కుటుంబాలను పరామర్శించి.. వారికి సాయం డబ్బును చెక్కుల ద్వారా అందజేస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిరివెళ్ల చేరుకుని.. రచ్చబండ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేసి సభలో ప్రసంగిస్తారు.
Pawan Tour: నేడు నంద్యాలలో పవన్‌కల్యాణ్ పర్యటన - పవన్ కల్యాణ్ పర్యటనలు
Pawan Tour: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. శిరివెళ్ల గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేస్తారు.
నేడు నంద్యాలలో పవన్ పర్యటన